Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇద్దరితో ప్రేమలో పడ్డానంటున్న హీరోయిన్... ఎవరు? (వీడియో)

కాజల్ అగర్వాల్... టాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో అగ్రహీరోలందరితో నటించి మెప్పించారు. అయితే, ఈమెకు ఇటీవలికాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఇతర భాషలపై దృష్టిసారించారు.

ఇద్దరితో ప్రేమలో పడ్డానంటున్న హీరోయిన్... ఎవరు? (వీడియో)
, గురువారం, 15 మార్చి 2018 (12:17 IST)
కాజల్ అగర్వాల్... టాలీవుడ్‌లోని సీనియర్ హీరోయిన్లలో ఒకరు. తెలుగులో అగ్రహీరోలందరితో నటించి మెప్పించారు. అయితే, ఈమెకు ఇటీవలికాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దీంతో ఇతర భాషలపై దృష్టిసారించారు. 
 
ఇదిలావుండగా, ఈ భామ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందు ఇద్దరితో ప్రేమాయణం కొనసాగించారట. ఎవరినైనా ప్రేమించారా?, పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు ఆమె పైవిధంగా బదులిచ్చింది. పైగా, తాను ఎక్కడికి వెళ్లినా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయని వాపోయింది. 
 
అయినప్పటికీ ఏమాత్రం విసుగు చెందకుండా బదులిచ్చింది. సినిమాల్లోకి రాకముందు ఒకరిపై ప్రేమ పుట్టిందని, సినిమాల్లోకి వచ్చిన తర్వాత మరొకరిపై ప్రేమ పుట్టిందని తెలిపింది. నటి కాకముందు ప్రేమించడం సులభమేని చెప్పిన కాజల్, సినీ నటి అయిన తర్వాత ప్రేమలో పడటం చాలా కష్టమని వివరణ ఇచ్చింది. 
 
ప్రేమించిన వ్యక్తిని కలిసేందుకు కూడా సమయం దొరకదని వాపోయింది. ప్రియుడికి సమయం కేటాయించలేనప్పుడు ప్రేమలో పడి మాత్రం ఉపయోగం ఏమిటని ప్రశ్నించింది. అయితే, ఇంతరవకు తాను హద్దుమీరి ప్రవర్తించింది లేదని చెప్పింది. చాలా మంది హీరోలతో నటించినప్పటికీ వారితో హద్దుల్లోనే నడుచుకున్నానని తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూ ట్యూబ్‌ను షేక్ చేస్తున్న రంగస్థలం 'రంగమ్మ.. మంగమ్మా...' (వీడియో)