నటి కాజల్ తన పెళ్ళికి ఇప్పుడిప్పుడే తొందరలేదని తేల్చిచెబుతోంది. సినిమా కెరీర్‌కన్నా.. వ్యక్తిగతం ముఖ్యం కాదని అంటోంది. ఒక దశలో టాప్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న కాజల్.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కువ ప్లాప్ చిత్రాలు రావడంతో కొంత గ్యాప్ తీసుకుని.. హిందీలో నటించింది. ఓ దశలో లిప్‌కిస్‌లుకూడా ఇచ్చేసింది. ప్రస్తుతం తేజ సినిమాలో నటించనుంది.
ఓ సారి తన కెరీర్‌ను విశ్లేషిస్తూ... పెళ్ళికి వయస్సుతో సంబంధంలేదని.. అందరూ తనకు ముప్పై ఏళ్లు వచ్చాయని గుర్తుచేస్తున్నారనీ.. అసలు ఏజ్ గురించి మీరు చెప్పేదాకా తెలియదని మీడియాతో పేర్కొంది. ఏ మనిషికైనా కెరీర్ ముఖ్యం. ఇది రాత్రికి రాత్రి వచ్చేది కాదనీ.. అందుకే కెరీర్‌పైనే తాను శ్రద్ధ పెడుతున్నట్లు చెప్పింది. కాగా, కాజల్ ఇండస్ట్రీలో ఓ వ్యక్తిని ప్రేమించినట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఆమె కొట్టిపారేసింది.