'కబాలి' క్లైమాక్స్ ఏంటంటే... లీక్ చేసిన దర్శకుడు పా.రంజిత్
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఈనెల22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం కబాలి మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కబాలి చర్చే జరుగుతుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఈనెల22వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రస్తుతం కబాలి మేనియా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కబాలి చర్చే జరుగుతుంది. కాబాలి... డా అంటూ ప్రతి ఒక్కరూ రజినీకాంత్ చెప్పే డైలాగ్‌ను వల్లె వేస్తున్నారు. దీంతో రజినీ అభిమానులతో పాటు.. ఇటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో ‘కబాలి’ క్లైమాక్స్ విషయంలో కోలీవుడ్ వ్యాప్తంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తూర్పు, పడమర ఎదురెదురైనట్లు సంప్రదాయానికి భిన్నంగా ‘కబాలి’ ముగుస్తుందంటున్నారు. కబాలి కథ విషాదాంతమవుతుందని తెలుస్తోంది. అందుకు కారణం ఆ చిత్ర దర్శకుడు పా రంజిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలే.
ఈ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. 'నేనేం రాజీ పడలేదు. నా గత ప్రాజెక్టుల్లాగానే ‘కబాలి’ని కూడా రాజీ పడకుండా తెరకెక్కించాను. రియలిస్టిక్ ఫిలింగా తీర్చిదిద్దాను’’ అని పా. రంజిత్ అన్నారు. క్లైమాక్స్ గురించి కూడా సూచనప్రాయంగా కాస్త చెప్పారు. ఈ సినిమాపై నిర్మాత కలైపులి ఎస్. థాను, రజనీకాంత్ కుమార్తె సౌందర్య సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అయితే క్లైమాక్స్ విషయంలోనే కాస్త ఆలోచించారన్నారు. సినిమా సరదాగా ముగియాలని వారు కోరుకున్నారన్నారు.
కానీ, రజినీకాంత్ సార్ నాకు అండగా నిలిచారు. ముగింపును ఎవరి కోసమూ మార్చవద్దని, అది బిగ్గెస్ట్ హైలైట్ అవుతుందని రజనీకాంత్ చెప్పారని చెప్పినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ‘కబాలి’ విషాదాంతంగా ముగుస్తుందంటూ సాగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూర్చుతుంది. వాస్తవానికి రజినీకాంత్ సినిమాల్లో క్లైమాక్స ఎపుడు కూడా సరదగా ముగుస్తుంది. హీరో జీవించే ఉంటారు. కానీ ఈ చిత్రంలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా క్లైమాక్స్ ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.