Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కబాలి' కలెక్షన్ల సునామి... ఒక్క రోజులో రూ.100 కోట్లు వసూలు

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం... బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది.

'కబాలి' కలెక్షన్ల సునామి... ఒక్క రోజులో రూ.100 కోట్లు వసూలు
, శనివారం, 23 జులై 2016 (15:30 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'కబాలి' చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం... బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కురిపిస్తోంది. తమిళం, తెలుగు, హిందీతో మరికొన్ని బాషల్లో విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉంది అన్న సంగ‌తి ప‌క్క‌న పెడితే... విడుదల ముందు నుంచే భారీ హైప్ ఉండటం, సినిమాకు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు వరల్డ్ వైడ్ దాదాపు 4000 స్క్రీన్లలో రిలీజ్ చేయడం, అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరగడంతో ఓపెనింగ్స్ పరంగా కలిసొచ్చింది. ఫలితంగా తొలిరోజు బిజినెస్ అంచనాలను దాటిపోయింది.
 
'కబాలి' మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ ఇప్పటివరకు వచ్చిన అన్ని భారతీయ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా అందరి అంచనాలను మించి పోయింది. ఓవర్సీస్‌లో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా ఓపెనర్‌గా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 
 
సాధార‌ణంగా బాలీవుడ్ సినిమాలు ఏవైనా రూ.100 కోట్ల కలెక్షన్ రావాలంటే కనీసం మూడు నుంచి ఐదు రోజులు పడుతుంది. కానీ దక్షిణభారత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కబాలి' సినిమా ఆ ఫీట్ను ఒక్కటంటే ఒక్క రోజులోనే సాధించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సినిమా నిర్మాత కలైపులి ఎస్.థాను వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కబాలి' టిక్కెట్ల కోసం మంత్రిత్వ శాఖల నుంచి సిఫార్సు లేఖలు!