ఇరు మురుగన్ ట్రైలర్‌ను పదే పదే చూశా.. విక్రమ్ యాక్టింగ్ సూపర్: సమంత ట్వీట్
ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ఇరుముగన్''. తెలుగులో "ఇంకొకడు"గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ను సమంత పదే పదే చూసిందట.
హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆనందంలో తేలియాడుతోంది. ఒకవైపు ప్రేమ, మరోవైపు పెళ్లి.. ఇంకోవైపు ఫ్రెండ్స్, లవర్‌తో కలిసి బెల్జియం టూరంటూ బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న సమంత.. ఈ సినిమాతో తట్టా బుట్టా సర్దేసి హౌస్ వైఫ్‌గా మారిపోతుందని కూడా టాలీవుడ్‌లో గాసిప్స్ వినబడుతున్నాయి. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కైవసం చేసుకున్న సమంత ''జనతా గ్యారేజీ" చిత్రంలో నటిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం "ఇరుముగన్''. తెలుగులో "ఇంకొకడు"గా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌ను సమంత పదే పదే చూసిందట. విక్రమ్ నటన అద్భుతంగా ఉందంటూ ఈ బ్యూటీ తెగ పొగిడేసింది. సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నట్లు సమంత ట్వీట్ చేసింది.