Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అణాపైసలతో సహా చెల్లిస్తా... పన్ను ఎగవేతపై జూ.ఎన్టీఆర్ ట్వీట్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "నాన్నకు ప్రేమతో". ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రంలో నటించినందుకు హీరో లండన్‌‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్

Advertiesment
అణాపైసలతో సహా చెల్లిస్తా... పన్ను ఎగవేతపై జూ.ఎన్టీఆర్ ట్వీట్
, శనివారం, 5 ఆగస్టు 2017 (16:16 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "నాన్నకు ప్రేమతో". ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే, ఈ చిత్రంలో నటించినందుకు హీరో లండన్‌‌కు చెందిన వైబ్రంట్‌ విజువల్‌ లిమిటెడ్‌ ప్రొడ్యూసింగ్‌ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయల పారితోషికం అందుకున్నాడని, ఇందులో పన్నుగా చెల్లించాల్సిన 1.10 కోట్ల రూపాయలను ఎక్స్‌‌పోర్ట్‌ ఆఫ్‌ సర్వీసుగా పరిగణించి పన్ను మినహాయింపునిచ్చారని కాగ్ పేర్కొన్నట్టు  పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ వెల్లడించారు. దీనిపై జూనియర్ ఎన్టీఆర్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వనున్నామని ఆర్థిక శాఖ అనుబంధ రెవెన్యూ విభాగం తెలిపింది. 
 
దీనిపై ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "పొరుగుదేశంలో నిర్మించిన చిత్రానికి భారత్‌లో పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతోనే నేను నిర్మాతల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదు. దీనిపై 2016లో జరిగిన కాగ్ విచారణలో ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తన ఆడిటర్లు తెలియజేశారు కూడా. ఆ తర్వాత దానికి సంబంధించిన నోటీసులు కానీ, ఇతర వివరాలేవీ తనకు అందలేదు.
 
చాలా సంవత్సరాలుగా పన్నులు, సర్వీస్ ట్యాక్సులు క్రమబద్ధంగా చెల్లిస్తున్న వ్యక్తుల్లో నేనూ ఒకడిని. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఏనాడూ విస్మరించలేదు. ఈ విషయంలో సంబంధిత అధికారులతో నోటీసులు ఏవైనా అందితే అందులోని వివరాల ప్రకారం అణాపైసలతో సహా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ విషయంలో వివరాలు తెలియాల్సి ఉందని, చట్టానికి కట్టుబడి ఉండాలని నమ్మే వ్యక్తిని తానని, ఈ విషయంలో కూడా అలాగే ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనుష్కతో పెళ్ళా... అవన్నీ ఉత్తుత్తివే.. ''సాహో'' తర్వాత ఆలోచిస్తా!: ప్రభాస్