Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా ఇంట్లో నాకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరుగుతోంది : జూనియర్ ఎన్టీఆర్

హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తమ ఇంట్లో పెద్ద కుట్ర జరుగుతోందని వాపోయాడు. ఆ కుట్రదారులు ఎవరో కాదనీ.. తన కుమారుడు, వాళ్ల అమ్మేనని చెప్పాడు. దీనిపై వాళ్ళతో ఎదో ఒకటి త

Advertiesment
jai lava kusa
, శనివారం, 8 జులై 2017 (11:18 IST)
హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వ్యతిరేకంగా తమ ఇంట్లో పెద్ద కుట్ర జరుగుతోందని వాపోయాడు. ఆ కుట్రదారులు ఎవరో కాదనీ.. తన కుమారుడు, వాళ్ల అమ్మేనని చెప్పాడు. దీనిపై వాళ్ళతో ఎదో ఒకటి తేల్చుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. 
 
ఇంతకీ జూ.ఎన్టీఆర్ ఇలా ఎందుకు వ్యాఖ్యానించాడో పరిశీలిస్తే... తన కుమారుడితో తనకు చాలా అటాచ్‌మెంట్ ఉందన్నాడు. తాను ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లే ముందు వాడిని దగ్గరకి తీసుకుని "నీకు ఎవరంటే ఇష్టం నాన్నా... అమ్మా? నాన్నా?" అని అడిగితే వాడు టక్కున "నాన్న" అని అంటూ ఠక్కున సమాధానం చెప్పేవాడన్నారు. 
 
అయితే, ఈ మధ్యనే వాడిని స్కూల్‌లో జాయిన్ చేయడంతో "నేను షూటింగ్ షూటింగ్ నుంచి వచ్చేసరికి వాడు నిద్రపోతున్నాడు... మళ్లీ నేను నిద్రలేచేసరికి స్కూల్‌కి వెళ్లిపోతున్నాడు"... ఓ రోజున ఉదయం వాడు "నాన్నా" అనుకుంటూ తన దగ్గరకి వచ్చాడని, వాడితో మాట్లాడుతూ.."నాన్నా నీకు ఎవరంటే ఇష్టం అమ్మా? నాన్నా?" అని అడగ్గానే ఎప్పుడూ "నాన్న" అనే వాడు అకస్మాత్తుగా "అమ్మ" అనేశాడని... తాను షూటింగ్‌లకు వెళ్తుండటంతో వాడు, వాళ్లమ్మ ఒక్కటైపోయారని... ఇంత పెద్ద కుట్ర ఎప్పుడు జరిగిందో ఇంటికెళ్లగానే వాళ్లమ్మతో తేల్చుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ సరదాగా వ్యాఖ్యానించాడు. దీంతో అంతా నవ్వేశారు. అదన్నమాట ఇంట్లో జరుగుతున్న పెద్ద కుట్ర. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రావణుడ్ని సంపాలంటే.. సముద్రమంత ధ ధ ధ ధ ధైర్యం ఉండాలా' : టీజర్‌పై ఎన్టీఆర్ ఏమన్నారు