Viraj Ashwin, Poojita Ponnada
బేబి చిత్రంతో కథానాయకుడిగా ప్రేక్షకుల హౄదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా హుషారుగా పూజిత పొన్నాడ కథానాయిక. అను ప్రసాద్ దర్శకుడు. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ పతాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ను శనివారం విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాతలు కేఎల్ దామోదర్ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్, దర్శకుడు కష్ణ చైతన్య , సీనియర్ పాత్రికేయులు టీవీ 5 మూర్తి, వినాయకరావు, సురేష్ కొండేటి లు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ చిత్ర జోడి ముచ్చటగా వుంది. టీజర్ ఇంప్రెసివ్ గా వుంది. తప్పకుండా చిత్రం కూడా జనాదరణ పొందాలని ఆశిస్తున్నాను అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ ఇదొక జెన్యూన్ లవ్ ఎంటర్ టైనర్. మంచి సినిమాలకు నా సపోర్ట్ ఎప్పడూ వుంటుంది. ఈ చిత్రం చూశాను. అందుకే ఈ చిత్రం విడుదలకు నా వంతు సహకారం అందిస్తున్నాను. దర్శకుడు అనుప్రసాద్ చిత్రాన్ని ఎంతో చక్కగా తెరకెక్కించాడు. చిత్రంలో వుండే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిరిని అలరిస్తుంది. సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
దర్శకుడు అనుప్రసాద్ మాట్లాడుతూ నేటి యువతరం నచ్చే అంశాలతో అన్ని ఎమోషన్స్‌తో రూపొందుతన్న ఈ చిత్రం కొత్తదనం ఆశించే అందరికి నచ్చుతుంది. నన్ను అని విధాల సపో ర్ట్ చేస్తున్న అందరికి థ్యాంక్స్.
దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ దర్శకుడు అనుప్రసాద్ నాకు స్నేహితుడు, మంచి ప్రతిభావంతుదు. టీజర్ తో పాటు సంభాషణలు కూడా హృదయానికి హత్తుకున్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మహిరెడ్డి పందుగుల, నటుడు చైతన్యరావ్, మధునందన్, కథానాయిక సోనూ ఠాకూర్, తదితరులు పాల్గోన్నారు. విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సాయికుమార్, రోహిణి, మధునందన్, సిరి హనుమంతు, సోనూ ఠాకూర్, బ్రహ్మజీ , చమ్మక్ చంద్ర, క్రేజీ కన్నా తదితరులు నటిస్తున్న చిత్రానికి సంగీతం: ప్రణీత్ మ్యూజిక్, ఎడిటర్: మర్తండ్‌కెవెంకటేష్, ప్రొడక్షన్ కంట్రోలర్: తేజ తిరువిధుల