Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్.. త్రివిక్రమ్ సినిమాతో ఎంట్రీ

Advertiesment
జూనియర్ ఎన్టీఆర్‌తో జాన్వీ కపూర్.. త్రివిక్రమ్ సినిమాతో ఎంట్రీ
, సోమవారం, 30 మార్చి 2020 (12:34 IST)
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించనుంది. జాన్వీ కపూర్ కూడా కొంత కాలంగా తెలుగు సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోంది. ఈ సినిమాతో ఆమెను తెలుగు తెరకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ వున్నాడని అంటున్నారు. 
 
ఒకవేళ జాన్వీ కపూర్ డేట్స్ సర్దుబాటు చేయలేకపోతే, పూజా హెగ్డేను తీసుకుందామనే నిర్ణయానికి వచ్చేశారని చెప్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ''అరవింద సమేత'' భారీ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 
గతంలో విజయ్ దేవరకొండ సినిమాతో జాన్వీ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుందన్న ప్రచారం జరిగినా ఆ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ కాలేదు. తాజాగా జాన్వీ, ఎన్టీఆర్‌ సినిమాతో ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
 
సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవీ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఆయన మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఆ అందాల భామ కూతురు నటిస్తుండటంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా విస్తరిస్తోంది... బర్త్‌డే సెలెబ్రేషన్స్ వద్దు.. పెళ్లి వాయిదా వేసుకున్నా....