Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాహుబలిపై జేపీ ప్రశంస.. నా పనైపోయిందన్న రాజమౌళి.. డబ్బుల్లేక కష్టపడిన ప్రభాస్

బాహుబలి ది బిగినింగ్‌‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసలు కురిపించారు. బాహుబలి 2 అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడుకున్నదని.. డైరెక్టర్ ఎస్ఎస్ రా

Advertiesment
బాహుబలిపై జేపీ ప్రశంస.. నా పనైపోయిందన్న రాజమౌళి.. డబ్బుల్లేక కష్టపడిన ప్రభాస్
, శుక్రవారం, 5 మే 2017 (12:16 IST)
బాహుబలి ది బిగినింగ్‌‌కు సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 సినిమాపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశంసలు కురిపించారు. బాహుబలి 2 అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో కూడుకున్నదని.. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి భారత సినీ పరిశ్రమను ప్రపంచ పటంలో ఉంచారని ట్వీట్ చేశారు జేపీ. కీరవాణి సంగీతం స్పూర్తి దాయకం. రమ, వల్లి, మూవీ యూనిట్ ఏళ్ల తరబడి కష్టపడి మాస్టర్‌పీస్‌ను రూపొందించారన్నారు.
 
ఇదిలా ఉంటే.. 'బాహుబలి-2' చివరి ప్రమోషన్ ఈవెంట్ లండన్‌లో ముగిసింది. ఈ సినిమా కోసం దర్శకదిగ్గజం రాజమౌళి ఐదేళ్లపాటు ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రాజమౌళి ట్వీట్ చేశాడు. "లండన్‌లో జరిగిన ఈ చివరి ప్రమోషన్ ఈవెంట్‌తో... బాహుబలి సినిమా సిరీస్‌తో తన పని ముగిసిపోయింది" అని తెలిపాడు. 'మై జాబ్ ఈజ్ కంప్లీట్లీ ఓవర్' అని చెప్పాడు. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.
 
ప్రభాస్ గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ప్రభాస్‌కు బాహుబలిలో నటిస్తుండగా మంచి ఆఫర్లు వచ్చాయి. నిర్మాతలు ఎందరో చెక్కులతో వచ్చారు. కానీ ప్రభాస్ అందుకు నిరాకరించాడు. ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేకుండా కష్టపడేవాడు. అయినా పట్టించుకోకుండా తన పనిని పూర్తి చేశాడని రాజమౌళి ప్రభాస్‌ను కొనియాడాడు. అంతేకాదు.. రూ.10 కోట్ల విలువైన ఎండార్స్‌మెంట్ చేతికొచ్చినా తిరస్కరించాడు. అతడికి అబద్ధమాడడం తెలియదు. ఇతరుల సెంటిమెంట్‌ను హర్ట్ చేయడం అతడికి రాదని ప్రభాస్ తెలిపారు.  ఇతరులు బాధ పడితే ప్రభాస్ చూడలేడని రాజమౌళి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు అనుష్క, తారక్ తర్వాతే ఎవరయినా... రాజమౌళి మాట