Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

చిరంజీవి బాటలో జయప్రద... సామాజిక న్యాయం కోసం మళ్లీ మేకప్...

కాసింత పాపులారిటీ ఉన్న హీరోలే ఏదో ఒక వంక చెప్పి, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల పుణ్యమాని ఆవేశపూరిత ప్రసంగాలిచ్చేసి లీడర్లుగా చెలామణీ అయిపోవాలని కలలు కనే కాలంలో.. మెగాస్టార్‌గా అశేష ఆంధ్ర ప్రజానీకం అభిమానం చూరగొన్న చిరంజీవి ముఖ్యమంత్రి పీఠం కోసం రాజకీయాల్లోకొ

Advertiesment
jayaprada
, శుక్రవారం, 12 మే 2017 (17:50 IST)
కాసింత పాపులారిటీ ఉన్న హీరోలే ఏదో ఒక వంక చెప్పి, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల పుణ్యమాని ఆవేశపూరిత ప్రసంగాలిచ్చేసి లీడర్లుగా చెలామణీ అయిపోవాలని కలలు కనే కాలంలో.. మెగాస్టార్‌గా అశేష ఆంధ్ర ప్రజానీకం అభిమానం చూరగొన్న చిరంజీవి ముఖ్యమంత్రి పీఠం కోసం రాజకీయాల్లోకొచ్చి, రకరకాల అనుభవాలతో, అభిమానుల కోరిక మేరకు అంటూ పెవిలియన్ బాటపట్టి తిరిగి ముఖానికి రంగు వేసేసుకున్నారు. 
 
ఇక డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ (యాక్ట్రెస్) అయిన లలితారాణి అలియాస్ జయప్రద 1994లో రాజకీయప్రవేశం చేసి, ఆ తర్వాత కాలంలో తెదేపా మహిళా విభాగ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించింది. రాజ్యసభకు కూడా పంపిన తెదేపాను వీడి ములాయంతో సమాజ్‌వాదీలో చేరిన ఆమె లోక్‌సభలో కూడా అడుగుపెట్టింది. ఇన్నాళ్లూ సినిమా రంగానికి దూరంగా ఉన్న జయప్రద, సుమారు 55 ఏళ్ల వయస్సులో తిరిగి ముఖానికి రంగు వేసుకోబోతున్నారు.
 
ఇక్కడ చిరంజీవితో పోలిక ఏంటంటే...
రైతులు, వారి నీటి సమస్యల ఆధారంగా తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాపై మనసుపడ్డ చిరంజీవి తన పునరాగమనానికి తగిన కథగా దాన్నే రీమేక్ చేసి విజయాన్ని అందుకున్న విషయం విదితమే. ఇప్పుడు జయప్రద సైతం అదే బాటలో రైతులు, నీటి సమస్యల నేపథ్యాన్నే ఇతివృత్తంగా ఎంచుకున్నారట. కాకపోతే ఈవిడ నటించబోయేది మలయాళంలో కనుక వాణిజ్యాంశాలు మరీ ఎక్కువగా ఉండే అవకాశం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజాలు చెపుతుంటే పాత్రలో లీనమై నిజంగానే ఏడ్చేశా : రమ్యకృష్ణ