Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"జయమ్ము నిశ్చయమ్మురా" వంటి మంచి చిత్రం చూడలేదు : కొరటాల

"జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా చూశాను. ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్. ఈ సినిమా చూశాక.. మన చుట్టూరూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించవచ్చొ నాకు అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్

Advertiesment
jayammu nischayammu raa
, సోమవారం, 14 నవంబరు 2016 (15:43 IST)
"జయమ్ము నిశ్చయమ్మురా" సినిమా చూశాను. ఇటీవలకాలంలో ఇంత మంచి సినిమా చూడలేదని నా ఫీలింగ్. ఈ సినిమా చూశాక.. మన చుట్టూరూ ఉండే మనుషుల్లోంచి ఎన్ని పాత్రలు సృష్టించవచ్చొ నాకు అర్థమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి నాకు కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ ఇంత మంచి సినిమా ప్రచారంలో పాలు పంచుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. రవిచంద్ర సమకూర్చిన సంగీతం ఈ సినిమాకు గల ప్రధాన ఆకర్షణలో ఒకటని చెప్పొచ్చు" అని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ అన్నారు. 
 
"సమైక్యంగా నవ్వుకుందాం" అనే ట్యాగ్ లైన్‌తో.. "దేశవాళీ వినోదం" అనే సరికొత్త నినాదంతో శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శివరాజ్ కనుమూరి నిర్మిస్తున్న "జయమ్ము నిశ్చయమ్మురా" చిత్రం థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన అనంతరం కొరటాల శివ పైవిధంగా స్పందించారు. ఇదేకార్యక్రమంలో ఈ చిత్రంలో జీవా పోషించిన "పితా" పాత్ర ఫస్ట్ లుక్ మరియు క్యారెక్టర్ టీజర్ రిలీజ్ చేసిన ప్రముఖ రచయిత వక్కంతం వంశీ మాట్లాడుతూ "సహజత్వానికి దూరంగా ఉండే సన్నివేశాలు, పాటలు, ఫైట్స్ చూసి చూసి విసిగిపోయి ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచె చిత్రం "జయమ్ము నిశ్చయమ్మురా". 
 
చిత్ర దర్శకుడు శివరాజ్ కనుమూరి ప్రతి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు" అన్నారు. "జయమ్ము నిశ్చయమ్మురా"లో పోసాని కృష్ణ మురళి పోషించిన "గుంటూరు పంతులు" పాత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేసిన ప్రముఖ యువ దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "జయమ్ము నిశ్చయమ్మురా"లో హీరోగా నటించిన నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డిని చూసి చాలా గర్వపడుతున్నాను. శివరాజ్ కనుమూరి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు" అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి జోగు రామన్న క్లాప్‌తో ప్రారంభమైన "బంజారా టైగెర్స్"