జయమ్మ కారు డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడా?లేదా ఎన్‌కౌంటర్ చేశారా?
దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్‌లో ఏం జరుగుతుందని తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. తమిళ రాష్ట్రంలోని నీలగిరీస్ జిల్లాలో జయలలితకు చెందిన 800 ఎకరాల విశాలమైన ఎస్టేట్ ఉంది. దీని మధ్యలో ఓ బంగ్లా ఉంది. జ
దివంగత సీఎం జయలలితకు చెందిన ఎస్టేట్‌లో ఏం జరుగుతుందని తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. తమిళ రాష్ట్రంలోని నీలగిరీస్ జిల్లాలో జయలలితకు చెందిన 800 ఎకరాల విశాలమైన ఎస్టేట్ ఉంది. దీని మధ్యలో ఓ బంగ్లా ఉంది. జయమ్మ బతికున్న రోజుల్లో తన నెచ్చెలి శశికళతో కలిసి ఈ ఎస్టేట్‌కు వచ్చేవారు. అధికారంలో ఉన్నా లేకున్నా వేసవిలో కొంత కాలం జయలలిత ఇక్కడే గడిపేవారు. ఐదు రోజుల క్రితం అర్థరాత్రి పూట ఈ ఎస్టేట్‌లో సెక్యూరిటీ గార్డును హత్య చేసి, మరో గార్డును గాయపరిచిన ఘటన సంచలనం రేపింది.
ఇలా దాడి చేసి బంగ్లాలోని జయకు సంబంధించిన విలువైన ఆస్తుల పత్రాలు, కొంత నగదు దోచుకువెళ్లారని తేలింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు జయ మాజీ డ్రైవర్ కనకరాజు పాత్ర ఉందని గుర్తించారు. అతడికి సహకరించారని అనుమానంతో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. కనకరాజు కోసం పోలీసులు గాలిస్తున్న తరుణంలోనే అత్తూరువద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కనకరాజు మరణించాడు.
అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదని టాక్ వస్తోంది. జయలలిత కొడనాడు ఎస్టేట్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులను ప్రాణాలతో పట్టుకుని అసలు రహస్యం బయటకు తియ్యాలి. అయితే ఒక్కరు అరెస్టు అయిన వెంటనే జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ పోలీసుల ఎన్ కౌంటర్‌లో అంతం అయివుంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.