Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ కష్ట సమయంలో నా భార్య వెన్నెముకగా నిలిచింది : జానీ మాస్టర్

jani master

ఠాగూర్

, మంగళవారం, 19 నవంబరు 2024 (10:33 IST)
తన జీవితంలో అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో తన భార్య వెన్నెముకగా నిలిచిందని నృత్యదర్శకుడు జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఇటీవల నా జీవితంలో కొన్ని కలలో కూడా ఊహించని సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో నా భార్య వెన్నెముకగా, బలంగా నిలబడింది. 
 
ప్రతి భార్య వారి భర్తలను మంచి బాటలో నడిపిస్తున్నారు కాబట్టే మంచి పొజిషన్‌కు వెళ్లగలుగుతున్నారు. కేవలం భార్యగానే కాకుండా తల్లిలా స్నేహితురాలిగా వెన్నంటే ఉండి మంచి వైపు నడిపిస్తున్నారు. నన్ను నమ్మిన సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాధారణంగా ఇలాంటి పరిస్థితులు వచ్చాక ఎవరూ కనిపించరు. కానీ, నా పరిస్థితి వేరు. నిజమేంటో త్వరలోనే తెలుస్తుంది. అన్ని విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి అని జానీ మాస్టర్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'పుష్ప-2' ట్రైలర్‌లో అరగుండుతో కనిపించే నటుడు ఎవరబ్బా?