Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేపు 'జనతా గ్యారేజ్‌' టీజర్‌... ఎన్టీఆర్ డైలాగ్ హాట్ టాపిక్ అవుతుందట...

ఎన్‌.టి.ఆర్‌. మోహన్‌ లాల్‌ నటిస్తున్న 'జనతా గ్యారేజ్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌తో కూడిన టీజర్‌ను ఈ నెల 6న బుధవారం నాడు విడుదల చేయనున్నారు. ఇప్పుడిక సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్‌ను పెంచేలా టీజర్‌ తయారవుతున్నట్లు సమాచారం. నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్ర

Advertiesment
Janata garrage teaser release
, మంగళవారం, 5 జులై 2016 (20:25 IST)
ఎన్‌.టి.ఆర్‌. మోహన్‌ లాల్‌ నటిస్తున్న 'జనతా గ్యారేజ్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌తో కూడిన టీజర్‌ను ఈ నెల 6న బుధవారం నాడు విడుదల చేయనున్నారు. ఇప్పుడిక సినిమా మీద ఇప్పటికే ఉన్న హైప్‌ను పెంచేలా టీజర్‌ తయారవుతున్నట్లు సమాచారం. నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్ని కూడా అలరించేలా ఈ టీజర్‌ కట్‌ చేసినట్లు యూనిట్‌ చర్యలు తీసుకోంటోంది. 
 
ఎన్టీఆర్‌ కూడా చాలా అందంగా, స్టైల్‌గా కనిపిస్తాడని చెబుతున్నారు. అంతేకాక టీజర్‌ చివర్లో ఎన్టీఆర్‌ తనదైన శైలిలో ఓ పవర్‌‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌ వేస్తాడట. ఈ డైలాగ్‌లో కొరటాల మార్కు ఉంటుందని.. టీజర్‌ రిలీజయ్యాక పెద్ద హాట్‌ టాపిక్‌గా మారుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. 
 
ఎన్టీఆర్‌ డైలాగ్‌ డెలివరీ గత సినిమాలకు కొంచెం భిన్నంగా ఉంటుందని.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ కూడా టీజర్‌కు ప్రధాన ఆకర్షణ అని చెబుతున్నారు. టీజర్‌ రిలీజ్‌ తర్వాత ఈ నెల 22న ఆడియో వేడుకకు ప్లాన్‌ చేస్తోంది జనతా గ్యారేజ్‌ టీమ్‌. హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగబోతోంది. ఆగస్టు 12న ఈ చిత్రం విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరు ఫ్యామిలీ ఆశీస్సుల కోసమేనా...?! సయేషా వీణ డ్యాన్స్