ఆదిపురుష్ నుంచి తాజా అప్డేట్ వచ్చింది. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీఖాన్ ప్రతినాయక పాత్ర పోషించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి శనివారం ఈ సినిమాలోని జై శ్రీరామ్ లిరికల్ మోషన్ పోస్టర్ వీడియోను రిలీజ్ చేసారు.
జై శ్రీరామ్..రాజారాం అంటూ శ్రీరాముడి గొప్పతనాన్ని చాటిచెబుతూ ఈ పాట సాగింది. తెలుగు, హిందీ సహా ఐదు భాషల్లో ఈ పాటను రిలీజ్ చేశారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన పాటకు తెలుగులో ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.