Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వాయిస్ వింటే నాకు కొత్త‌గా అనిపిస్తుంది : జ‌గ‌ప‌తి బాబు

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యాంబ్లిన్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై డిస్నీ రూపొందించిన హాలీవుడ్ చిత్రం బి.ఎఫ్‌.జి. బిగ్ ఫ్రెండ్ జెయింట్ చిత్రంలో జెయింట్ క్యారెక్ట‌ర్‌కు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ఈ చిత్రం జూలైలో విడుద‌

నా వాయిస్ వింటే నాకు కొత్త‌గా అనిపిస్తుంది : జ‌గ‌ప‌తి బాబు
, శనివారం, 9 జులై 2016 (17:58 IST)
రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యాంబ్లిన్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై డిస్నీ రూపొందించిన హాలీవుడ్ చిత్రం బి.ఎఫ్‌.జి. బిగ్ ఫ్రెండ్ జెయింట్ చిత్రంలో జెయింట్ క్యారెక్ట‌ర్‌కు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ఈ చిత్రం జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.... జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ ``స్పీల్ బ‌ర్గ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రానికి న‌న్ను డ‌బ్బింగ్ చెప్ప‌మ‌న్న‌ప్పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఒప్పుకున్నాను. 
 
ఇలాంటి ఓ డిఫరెంట్ వాయిస్ ఎలా ఇచ్చానో తెలియ‌దు కానీ ఓ మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది. నా వాయిస్ వింటే నాకు కొత్తగా అనిపిస్తుంది. బాలీవుడ్‌లో అమితాబ్ ఈ పాత్ర‌కు డబ్బింగ్ చెప్పారు. ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పిన పాత్ర‌కు నేను తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డం ఓ ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లో నాకే వేరే వాళ్ళు డ‌బ్బింగ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను వేరే పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం అనేది ఓ మంచి అనుభూతినిచ్చింద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. రాంగోపాల్‌వ‌ర్మ గుర్తించ‌నంతవ‌ర‌కు నా వాయిస్‌ను ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. అలాగే నేను ఇటీవ‌ల క్లిక్ సినీ కార్ట్స్ అనే వెబ్‌సైట్‌ను ఇక్క‌డ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
రీసెంట్‌గా ఆటా కార్య‌క్ర‌మం కోసం అమెరికా వెళ్లినప్పుడు అక్క‌డ కూడా సైట్ లాంచ్ చేయ‌డం జ‌రిగింది. అక్క‌డ ఉన్న 30-45 నిమిషాల్లోనే చాలామంది నెజిట‌న్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. చాలామంది సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తిని క‌న‌ప‌రిచారు. నేను అంత‌లా రెస్పాన్స్ వ‌స్తుంద‌ని ఊహించ‌లేదు. సినీ క్లిక్ అండ్ కార్ట్స్ ద్వారా సినిమాలు చేయ‌డానికి చాలా మంది ఇంట్రెస్ట్‌గా ఉన్నారు`` అన్నారు.
 
రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్మెంట్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ ``బిఎఫ్‌జి చిత్రాన్ని తెలుగులో డ‌బ్ చేయాల‌నుకున్న‌ప్పుడు మాకు మొద‌ట డ‌బ్బింగ్ కోసం ఆలోచ‌న వ‌చ్చిన వ్య‌క్తి జ‌గ‌ప‌తిబాబుగారు. ఆయ‌న ఈ పాత్ర‌కు ఎంతో అద్భుతంగా డిఫ‌రెంట్‌ వేరియేష‌న్‌లో డ‌బ్బింగ్ చెప్పారు. ఆయ‌న ఇన్‌వాల్వ్‌మెంట్‌తోనే ఈ పాత్ర‌కు ఇంత మంచి వాయిస్ వ‌చ్చింది. సినిమాను ఈ జూలై నెల‌లోనే విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రి గడిచి ఉదయాన్నే నా చెదిరిన జుట్టు చూడ్డం అతడికి చాలా ఇష్టం... ఇలియానా