Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారాను.. ఓ దర్శకుడు మూడు రోజులు..? (video)

Advertiesment
jabardasth
, శనివారం, 16 నవంబరు 2019 (13:17 IST)
జబర్దస్త్ నటులపై జోకులు పేలడం సాధారణమే. కానీ వారికి వేధింపులు కూడా తప్పడం లేదు. స్కిట్ల కోసం మగవారు ఆడవారి వేషాలు వేస్తుంటారు. అలాంటి వారిలో వినోద్, కమెడియన్ సాయితేజ మరొకడు.. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. సాయితేజ ప్రస్తుతం ప్రియాంకగా మారింది. 
 
సర్జరీ చేసుకుని మరీ సాయితేజ ఆమెగా మారిపోయాడు. ఈ మధ్య ఆమెకు పెళ్లైందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సాయితేజగా వుండి అమ్మాయిగా మారిన ప్రియాంక స్పందించింది. తాను ఎవ్వరినీ పెళ్లి చేసుకోలేదని, తనను ఎవ్వరూ చేసుకోరని క్లారిటీ ఇచ్చింది. కానీ పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పుకొచ్చింది. సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలామంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
వినోద్‌పై దాడి గురించి కూడా మనసులో మాట బయటపెట్టింది ప్రియాంక. ఇంటి కొనుగోలు విషయంలో ఓనర్ చేతిలోనే దాడికి గురయ్యాడు వినోద్. అసలు వాడిపై దాడి చేసిన వాళ్లు మనషులే కాదు.. మృగాలు అంటూ మండిపడింది ప్రియాంక. ఇక తన విషయంలో కూడా ఇప్పటికీ కొందరు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది ప్రియాంక. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెపై చాలా రకాలుగా దారుణమైన కమెంట్స్ వస్తున్నాయి.
 
ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. ఇక ఇప్పుడు కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతుంది ఈమె. ఈ మధ్యే తనకు ఓ దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని.. వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. 
 
అయితే ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. పెద్ద హీరోయిన్లే చేస్తున్నపుడు తానెందుకు చేయనని చెప్పింది ఈమె. కానీ తీరా బయల్దేరే సరికి తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది. దాంతో ఆ సినిమా వదిలేసుకున్నట్లు వెల్లడించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''సైకిల్'' ఎక్కేందుకు సిద్ధమైన పునర్నవి? (వీడియో)