Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య నటించిన 'హూ' ట్రైలర్ విడుదల

Advertiesment
hoo movie
, ఆదివారం, 13 ఆగస్టు 2023 (10:02 IST)
జెడి చక్రవర్తి, శుభ రక్ష, నిత్య హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కిన చిత్రం 'హూ'. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్, ఎడిటింగ్, వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. కాగా శనివారం హైదరబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోశాధికారి ప్రసన్న కుమార్, ఆర్టిస్ట్ నాగ మహేష్‌లు సంయుక్తంగా ఆవిష్కరించగా, పోస్టర్‌నిర్మాత ఆచంట గోపీనాథ్, నిర్మాత శోభారాణి, ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ కొల్లి రామ కృష్ణ సంయుక్తంగా ఆవిష్కరించారు. 
 
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర  సంగీత దర్శకుడు ఈశ్వర్, బలగం ఫేం సంజయ్, నిర్మాత విజయ్ డిస్ట్రిబ్యూటర్స్ మురళి కృష్ణ, రాందేవ్, శంకర్, పి ఆర్ ఓ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రెడ్డమ్మ కే బాలాజీ మాట్లాడుతూ జెడి చక్రవర్తి స్వీయ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకున్న ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ' హూ'. 
 
ఈ చిత్రంలో జెడి చక్రవర్తిగారి నటన చాలా వైవిధ్యంగా ఉంటుంది ఆయన రీసెంట్‌గా చేసిన "దయ" వెబ్ సిరీస్ ఓ సంచలనం. అంత పెద్ద హిట్ అయిన దయ సిరీస్‌లాగానే మా సినీమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం. అలాగే మాలాంటి చిన్న నిర్మాతలను ముందుండి నడిపిస్తున్న ప్రసన్న కుమార్‌కు, కొల్లి రామకృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
 
జెడి చక్రవర్తి, శుభ, నిత్య, వినయ్ ప్రసాద్, విజయ్ చందర్, సునీల్ పూర్ణిక్, రమేష్ పండిట్, హర్షిత, ఉగ్రం రవి, శరణ్య, సనత్, నాగేంద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఈశ్వర్ చంద్, ఎడిటింగ్: జెడి చక్రవర్తి, కెమెరా: ఎంబీ అల్లికట్టి, విజువల్ ఎఫెక్ట్స్: చందు, ప్రొడ్యూసర్: రెడ్డమ్మ కే బాలాజీ, దర్శకత్వం: జేడీ చక్రవర్తి, పిఆర్ఓ : బీ.వీరబాబు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కట్టప్ప ఇంట్లో విషాదం: సత్యరాజ్ తల్లి నాదాంబాళ్ కన్నుమూత