Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఓవర్.. ఫోటోల రిలీజ్.. నయనలా కంటతడిపెట్టిన శ్రియ? (Photos)

బాహుబలితో సరితూగేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆంధ్రుల రాజవంశాలకు మూల పురుషుడు శాతవాహన వంశ చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. మహోజ్వలమైన ఈ రాజు

Advertiesment
గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఓవర్.. ఫోటోల రిలీజ్.. నయనలా కంటతడిపెట్టిన శ్రియ? (Photos)
, శుక్రవారం, 2 డిశెంబరు 2016 (13:40 IST)
బాహుబలితో సరితూగేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఆంధ్రుల రాజవంశాలకు మూల పురుషుడు శాతవాహన వంశ చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి. మహోజ్వలమైన ఈ రాజు జీవిత చరిత్రను దృశ్యకావ్యంగా క్రిష్ మలుస్తున్నారు. ఈ నేపథ్యంలో శాతకర్ణిగా బాలయ్య నటిస్తున్నారు. ఇంకా బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్రశాతకర్ణి షూటింగ్ పార్ట్ దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. 
 
ఈ సందర్భంగా మూవీ యూనిట్ షూటింగ్ విశేషాలు వెల్లడిస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేయడంతో సీన్స్ చాలా బాగావచ్చాయని సినీ యూనిట్ కొనియాడింది. ఇక, షూటింగ్ స్పాట్‌లో బాలకృష్ణ, శ్రియ, హేమామాలినితోపాటు డైరెక్టర్ క్రిష్ కూడా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. ఈ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను బాలయ్య డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ముగించేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రియ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా శాతకర్ణి సెట్స్‌నుండి హీరోయిన్ శ్రియ చాలా భాదపడుతూ వెళ్లిందని టాక్. గతంలో శ్రీరామరాజ్యం సందర్భంగా షూటింగ్ ముగిసేటప్పుడు నయనతార కంటతడి పెట్టినట్లు.. శ్రియ కూడా బాధపడిందట.
webdunia
 
శాతకర్ణి షూటింగ్‌లో పాల్గొన్న శ్రియ ఇలాంటి ప్రెస్టీజియస్ సినిమాలో తాను ఓ భాగమైనందుకు గర్వంగా ఉందని తెలిపింది. ఇక షూటింగ్ చివరి రోజు కావడంతో అమ్మడు కాస్త ఎమోషనల్ అయ్యిందని.. ఆపై సెట్స్ నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. యూనిట్ సభ్యులు ఆమెను సముదాయించి పంపారని టాలీవుడ్‌లో టాక్. ఇకపోతే.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకొని, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

webdunia


 










































webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?