సినిమాలకు స్వస్తి చెప్పనున్న షారూఖ్ ఖాన్.. రయీస్ కలెక్షన్లే కారణమా?
ఖాన్ త్రయంలో ఒకడైన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాలకు స్వస్తి చెప్పేందుకు రెడీ అయిపోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో గతంలో పోటీపడిన షారూఖ్ ఖాన్
ఖాన్ త్రయంలో ఒకడైన బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ సినిమాలకు స్వస్తి చెప్పేందుకు రెడీ అయిపోతున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో గతంలో పోటీపడిన షారూఖ్ ఖాన్‌కు రయీస్ పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమా దాదాపు రెండు వందల కోట్లు వసూలు చేస్తుందని అందరూ ఊహించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమాకు కనీసం వసూళ్లు రావడం కష్టమైపోయింది.
ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇటీవల కాలంలో అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఇక చేతిలోనూ మంచి ఆఫర్లు లేవు. ఇన్ని పరిణామాల మధ్యలో బాద్‌షా హీరోగా బై బై చెప్పే అవకాశాలు లేకపోలేదని బాలీవుడ్ సినీ జనం అనుకుంటున్నారు. కానీ తమ హీరో హవా ఇంకా తగ్గలేదనీ, ఒక్కటంటే ఒక్క హిట్టు పడితే మునుపటి రేంజ్ అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని బాద్‌షా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.