Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Advertiesment
Allu Arjun, sukumar,  dil raju

ఠాగూర్

, బుధవారం, 22 జనవరి 2025 (14:01 IST)
తెలుగు చిత్రపరిశ్రమను ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. గత రెండు రోజులుగా ప్రముఖ నిర్మాతల గృహాలు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం 'పుష్ప' చిత్ర దర్శకుడు సుకుమార్ నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. 'పుష్ప' చిత్రానికి సుకుమార్ రైటింగ్స్ పేరుతో దర్శకుడు సుకుమార్ భాగస్వామిగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో హైదరాబాద్ నగరంలోని సుకుమార్ నివాసంలో బుధవారం తెల్లవారుజామున ఐటీ అధికారులు సోదాలు చేశారు. 
 
గత యేడాది డిసెంబరు నెలలో విడుదలైన 'పుష్ప-2' మూవీ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ నివాసంలో తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు, ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి. చైర్మన్ దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు జరిగిన విషయం తెల్సిందే. 
 
గత రెండు రోజులుగా ఐటీ అధికారులు మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీసులు, ఈ సంస్థ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలతో పాటు మ్యాంగో మీడియా సంస్థ, సత్య రంగయ్య ఫైనాన్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్‌‍లతో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీల్లోనూ ఐటీ శాఖ అధికారులు తనిఖీలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు కీలక దస్తావేజులను వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)