Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి - శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ. ఈ వార్త నిజ‌మేనా..?

Advertiesment
చిరంజీవి - శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ. ఈ వార్త నిజ‌మేనా..?
, గురువారం, 18 ఏప్రియల్ 2019 (21:50 IST)
మెగాస్టార్ చిరంజీవి – గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీ అంటూ ఓ వార్త బాగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది.  ఎప్ప‌టి నుంచో చిరు - శంక‌ర్ క‌ల‌యిక‌లో మూవీ వ‌స్తే చూడాల‌నివుంది అని చాలామంది అభిమానులు కోరుకున్నారు. రోబో ఫంక్ష‌న్‌కి చిరు ముఖ్య అతిధిగా హాజ‌రయ్యారు. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా ఉంటుంది అని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కాంబినేష‌న్ సెట్ కాలేదు.
 
తాజా వార్త ఏంటంటే… మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్.. చిరు కోసం క‌థ రెడీ చేయ‌మ‌ని శంక‌ర్‌ని సంప్ర‌దించార‌ని.. శంక‌ర్ కూడా సానుకూలంగా స్పందించార‌ని టాక్ వినిపిస్తోంది. ప్ర‌స్తుతం చిరు సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా చేస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమాని ద‌స‌రాకి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
ఈ మూవీ త‌ర్వాత చిరు బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్నారు. త్వ‌రలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీని కూడా కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నారు. చిరు త్రివిక్ర‌మ్‌తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ప్ర‌చారంలో ఉన్న చిరు – శంక‌ర్ కాంబో మూవీ నిజ‌మా కాదా అనే విష‌యం పై చిరు కానీ శంక‌ర్ కానీ అల్లు అర‌వింద్ కానీ స్పందించ‌లేదు. మ‌రి..క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'జెర్సీ' సినిమాకు సచిన్ కుటుంబ సభ్యులను సైతం వాడేశారు..