ఏ దిల్ హై ముష్కిల్‌తో హీటెక్కించిన ఐశ్వర్యారాయ్.. బుల్లితెరపై మెరవనుందట..
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న ఐశ్వర్యారాయ్ బుల్లితెరపై దృష్టి పెట్టింది. అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుక
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న ఐశ్వర్యారాయ్ బుల్లితెరపై దృష్టి పెట్టింది. అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఐష్.. పాపకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మొహానికి రంగు వేసుకుని పలు చిత్రాల్లో నటిస్తోంది.
ఐష్ నటించాలి కాని ఆమెకు ఆవకాశాలు కరువా అన్నట్లు వరుసగా అవకాశాలు కూడా వెల్లువల్లా వస్తున్నాయి. ఈమె క్రేజ్‌ను వాడుకోవాలనుకుంటున్న నిర్మాతలు ఆమెను బుల్లితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు. బుల్లితెరపైకి రావడానికి భారీగానే డిమాండ్ చేసిన ఐష్ ఎట్టకేలకు నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో ఐష్ వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. అయితే ఇది ఏ కాన్సెప్ట్, ఆ షో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తెలియరాలేదు.