Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కబాలికి ''మదారి''తో చిక్కు.. కబాలి యూనిట్ కాపీ కొట్టిందన్న ఇర్ఫాన్ ఖాన్.. నిజమా?

సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కబాలి. ఈ చిత్రంలో రజినీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ము

కబాలికి ''మదారి''తో చిక్కు.. కబాలి యూనిట్ కాపీ కొట్టిందన్న ఇర్ఫాన్ ఖాన్.. నిజమా?
, బుధవారం, 29 జూన్ 2016 (12:03 IST)
సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కబాలి. ఈ చిత్రంలో రజినీ సరసన రాధికా ఆప్టే హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన మూవీ ఆడియోకి, ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో విడుదలైన ఈ మూవీ పోస్టర్ వివాదంలో చిక్కుకుంది. 
 
అందుకు కారణం ఈ పోస్టర్ ఇర్ఫాన్ ఖాన్ నటించిన ''మదారి'' చిత్రం పోస్టర్‌ని పోలియుండడమే. ఈ విషయమై బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ... తాను ఇటీవలే నటించిన మాదారి మూవీ పోస్టర్‌ను కబాలి చిత్ర యూనిట్ కాపీ కొట్టిందని అన్నారు. అయితే దీనిని పెద్ద విషయంగా పరిగణించవద్దని, అభిమానులు రజినీ సినిమాతోపాటు తమ సినిమాను కూడా చూడాలని ఆయన తెలిపారు. 
 
మరోవైపు రజినీ అభిమానులు పెద్ద ఎత్తున ''కబాలి'' పోస్టర్లు, ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే మదారి ఫిల్మ్ పోస్ట‌ర్‌ను పోలిన క‌బాలి పోస్ట‌ర్‌పై ర‌జినీకాంత్ అభిమానులు స్పందించారు. అది అధికార‌క పోస్ట‌ర్ కాద‌ని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా గ్యారేజ్‌కు గులాబీ కారుకు లింకేంటి? ఏదైనా సీన్ కోసం పెట్టారా.. లేకుంటే?