Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనతా గ్యారేజ్‌కు గులాబీ కారుకు లింకేంటి? ఏదైనా సీన్ కోసం పెట్టారా.. లేకుంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హై

జనతా గ్యారేజ్‌కు గులాబీ కారుకు లింకేంటి? ఏదైనా సీన్ కోసం పెట్టారా.. లేకుంటే?
, బుధవారం, 29 జూన్ 2016 (11:32 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ''జనతా గ్యారేజ్''. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులోని సారథి స్టూడియోస్‌లో శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ చిత్రం షూటింగ్ కోసం భారీ గ్యారేజ్ సెట్ కూడా వేశారు. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.
 
కాగా ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించడంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ''జనతా గ్యారేజ్.. ఇక్కడ అన్ని రకాల వెహికిల్స్‌కు రిపేర్లు చేయబడును'' అనే క్యాప్షన్ ఈ సినిమాకు మరింత ఆకర్షణీయంగా నిలిచింది. అయితే గ్యారేజ్‌లో ఆగిన ఒక గులాబీ కారు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు సినిమాలోని ఏదైనా సీన్ కోసం పెట్టిందా, లేకుంటే మరేదైనా కారణముందా అని తెలీక ప్రేక్షకులు తలబద్దలు కొట్టుకుంటున్నారు. మరి దీనికి సంబంధించిన ఏవైనా వివరాలు బయటకు వస్తాయో లేదో వేచిచూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేసవి సెలవుల నాటికి అఖిల్, నాగచైతన్యల డుం. డుం. డుం.. నాగ్ గ్రీన్‌సిగ్నల్!