బాలీవుడ్ అగ్రనటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ ఫిట్‌నెస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా ఐరా ఖాన్ బాలీవుడ్ హీరోయిన్లకు టఫ్ ఇస్తూ గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తూ బాలీవుడ్ వార్తల్లో నిలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిమ్‌లో వర్కౌట్ చేసే వీడియోను అమీర్ ఖాన్ కుమార్తె ఐరా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసింది. ఈ వీడియోను సినీ ప్రేక్షకులు తెగ లైక్ చేస్తున్నారు. ఈ వీడియో తుఫానులా వైరల్ అవుతోంది.
కాగా బాలీవుడ్ అగ్రశ్రేణి నటుడు అమీర్ ఖాన్ విభిన్న పాత్రలు పోషించడంలో దిట్ట. ప్రస్తుతం అమీర్ ఖాన్‌కు 53 ఏళ్లు. 1986లో రనా దత్తను అమీర్ ఖాన్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జునైద్ అనే కుమారుడు, ఐరా అనే కుమార్తె వున్నారు.
అటు పిమ్మట 2002వ సంవత్సరం రనా దత్తాతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆమెకు అమీర్ ఖాన్ విడాకులు ఇచ్చాడు. తర్వాత 2005వ సంవత్సరం కిరణ్ రావుతో అమీర్ ఖాన్ రెండో వివాహం జరిగింది.
కిరణ్ రావు, అమీర్ ఖాన్ నటించిన లగాన్ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు అజాద్ రావ్ ఖాన్ అనే కుమార్తె పుట్టింది. మొదటి భార్య దూరమైనప్పటికీ అమీర్ ఖాన్ తన ముగ్గురి సంతానాన్ని పక్షపాతం లేకుండా పెంచుతున్నారు.
వీరిలో ఐరా త్వరలో బాలీవుడ్ తెరంగేట్రం చేసే అవకాశం లేకపోలేదని టాక్ వస్తోంది. అందుకే ఈమె హాట్ ఫోటోలను నెట్టింట్లో పోస్టు చేస్తుందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.