Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేతాబసు ప్రేమలో పడింది.. బాయ్ ఫ్రెండ్ దొరికాడు.. త్వరలో పెళ్ళి కూడా?!

బాలనటిగా.. ఆపై హీరోయిన్‌గా కొత్తబంగారు లోకం వంటి సినిమాల్లో నటించి, ఐటమ్ గర్ల్‌గా మారిన శ్వేతాబసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటమ్ గర్ల్‌కే పరిమితం కావడంతో.. దొరికిన ఛాన్సుల్ని చేసుక

Advertiesment
Iqbal actress Shweta Basu Prasad is dating filmmaker Rohit Mittal!
, సోమవారం, 18 జులై 2016 (12:59 IST)
బాలనటిగా.. ఆపై హీరోయిన్‌గా  కొత్తబంగారు లోకం వంటి సినిమాల్లో నటించి, ఐటమ్ గర్ల్‌గా మారిన శ్వేతాబసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐటమ్ గర్ల్‌కే పరిమితం కావడంతో.. దొరికిన ఛాన్సుల్ని చేసుకుంటూపోయిన శ్వేత ఆమధ్య సెక్స్ రాకెట్ కేసులో పట్టుబడి, కోర్టు నుంచి క్లీన్ చీట్‌తో బయటపడింది. 
 
ప్రస్తుతం ఈ అమ్మడు ముంబై ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ ఆఫీస్‌లో స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ప్రియుడి మాటెత్తని శ్వేతాబసు ప్రసాద్‌కు ఇటీవల ఓ యువకుడు తారసపడ్డాడు. దీంతో శ్వేతాబసుకు బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు. అంతేకాకుండా ప్రేమలో పడిన వీరు ఫిబ్రవరి నుంచి డేటింగ్ మొదలెట్టారు. శ్వేతా బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. అనురాగ్ ఆఫీస్‌కి ఎక్కువగా వచ్చే చిన్న సినిమాల నిర్మాత, దర్శకుడు రోహిత్ మిట్టల్. 
 
ఇతగాడు ఆటో హెడ్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడట. ఇద్దరి అభిరుచులూ ఒకేవిధంగా ఉండటంతో.. ఒకరికొకరు హ్యాపీగా ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. త్వరలో శ్వేత-రోహిత్‌‍ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సెక్స్ రాకెట్ పేరిట ఎంతో మానసిక ఒత్తిడి గురైన ఆమెకు రిలాక్స్ లభించినట్లవుతుంది. తద్వారా కొత్త బంగారు లోకం ఆమెకు లభించినట్లవుతుందని మనమందరం ఆశిద్దాం.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పొట్టని కనిపించకుండా చున్నీతో కవర్ చేసిన బాలీవుడ్ భామ!