Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మా తండ్రి మేనల్లుడిగా పుట్టాడు.. దేవిశ్రీప్రసాద్‌ హ్యాపీ.. సోషల్ మీడియాలో ఫోటోలు

తన తండ్రి సత్యమూర్తి తనకు మేనల్లుడిగా పుట్టారని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరునికి కుమారుడిగా.. తనకు మేనల్లుడిగా తండ్రి సత్యమూర్తి జన్మించినట్లు భావిస్తున్నానని ద

Advertiesment
Introducin myDear NephewTANAV SATYA(MySister'sSon)named after myDad SATYAMURTYgaru
, సోమవారం, 2 జనవరి 2017 (14:42 IST)
తన తండ్రి సత్యమూర్తి తనకు మేనల్లుడిగా పుట్టారని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తన సోదరునికి కుమారుడిగా.. తనకు మేనల్లుడిగా తండ్రి సత్యమూర్తి జన్మించినట్లు భావిస్తున్నానని దేవీ తెలిపాడు. ఇందులో భాగంగా మేనల్లుడితో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. తన ప్రియమైన మేనల్లుడు తనవ్ సత్యను పరిచయం చేస్తున్నానని, బాబుకు తన తండ్రి పేరే పెట్టామని చెప్పాడు.
 
మేనల్లుడి రూపంలో తన తండ్రి తన వద్దకు తిరిగి వచ్చారని.. అందుకే అతనని డాడీబోయ్ అని పిలుస్తున్నట్లు చెప్పాడు. ఇంకా తన డాడీ బోయ్‌కి అందరి ఆశీర్వాదాలు కావాలని దేవీశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. కాగా, దేవీ శ్రీ ప్రసాద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150 సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైనాయి. 
 
ఖైదీ పాటలు విడుదల కావడమే ఆలస్యం పాటల్ని వినే శ్రోతల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఇంకా సాంగ్ మేకింగ్ వీడియోలు యూట్యూబ్‌లో వైరల్ అయిపోతున్నాయి. చిరంజీవి ఖైదీ ఎలా బంపర్ హిట్ కానుందో.. దేవీకి కూడా ఈ సినిమా ద్వారా ఆడియో హిట్ ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

webdunia
























webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా శరీరం.. నా దుస్తులు.. నాకు నచ్చినట్టుగా నేనుంటా.. మీకేంటి అభ్యంతరం : విద్యాబాలన్