Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రిష్‍‌నీ వదలని ఐటీ అధికారులు శాతకర్ణి బాలయ్యను ఎందుకు వదిలేశారో?

టాలివుడ్ నిర్మాతలపై ఐటీ కన్ను పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల వరద సృష్టించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాత, దర్శకులపై ఐటీ శాఖ గురిపెట్టింది. మంగళవారం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు

క్రిష్‍‌నీ వదలని ఐటీ అధికారులు శాతకర్ణి బాలయ్యను ఎందుకు వదిలేశారో?
హైదరాబాద్ , బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (02:11 IST)
టాలివుడ్ నిర్మాతలపై ఐటీ కన్ను పడింది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన సినిమాల్లో కలెక్షన్ల వరద సృష్టించిన గౌతమీపుత్ర శాతకర్ణి నిర్మాత, దర్శకులపై ఐటీ శాఖ గురిపెట్టింది. మంగళవారం గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా యూనిట్ మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సినిమా దర్శకుడు క్రిష్, నిర్మాత రాజీవ్ రెడ్డిల ఇళ్లలో సోదాలు జరిపారు. వాళ్లతో పాటు నైజాం ప్రాంతానికి ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన హీరో నితిన్ తండ్రి, ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఇంటిపై కూడా దాడులు జరిగాయి. 
 
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు అయిన బాలకృష్ణ నటించిన చారిత్రాత్మక చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి అద్భుత విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో అత్యంత సన్నిహితంగా ఉండే ముఖ్యమంత్రి వియ్యంకుడు నటించిన సినిమా అని కూడా చూడకుండా ఐటీ అధికారులు శాతకర్ణి చిత్ర నిర్మాతలు, దర్శకుడి ఇళ్లలో సోదా  చేయడానికి బలమైన కారణం ఉంది.
 
దాదాపు 45 కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా ఎంత వసూళ్లు సాధించిందన్న విషయాన్ని ఎవరూ ఎక్కడా ప్రకటించలేదు. దాంతో ఐటీ అధికారులకు అనుమానాలు తలెత్తాయి. ఇదే సినిమాతో పాటు విడుదలైన ఖైదీ నెం.150 కలెక్షన్ల గురించి విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే దీనికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ కలెక్షన్లను కూడా ఎక్కడా చెప్పకపోవడం అనుమానాలకు తావిచ్చింది. అందుకే నిర్మాతలతో పాటు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ల మీద కూడా ఐటీ దాడులు చేస్తున్నారు. 
 
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా సక్సెస్‌ఫుల్‌గా ఆడుతూ నేటికీ భారీ లాభాలను ఆర్జించిపెడుతోంది. ఈ సినిమాకు భారీ లాభాలు వస్తున్నాయని ఐటీ అధికారులకు తెలియడంతో నిర్మాతలు, దర్శకుడి ఇళ్లలో సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబంధించి మొత్తం లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. 
 
దర్శకుడిపై ఐటీ దాడులు జరగటం మునుపెన్నడూ చూడలేదు. సినిమా నిర్మాతలలో క్రిష్‌కూ భాగస్వామ్యం ఉంది కాబట్టే తన ఇంట్లోనూ సోదాలు జరుపుతున్నారు. కాని ఈ సినిమా హీరో అయిన బాలకృష్ణ ఇంటి మీద కూడా ఇప్పుడు ఐటీ దాడులు జరగకపోవడం విశేషం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమౌళిని ఆ విషయం నేనైతే అడగను... అడిగితే నేను ఓకే : నాగార్జున ఇంటర్వ్యూ