హీరోహీరోయిన్లుగా కొత్తవారితో తీసిన సినిమా `ఇప్పుడు కాక ఇంకెప్పుడు`. వై.యుగంధర్ దర్శకుడు. చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మించారు. ఈ సినిమాను ఆగస్టు 6న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు తెలియజేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిత్ర వివాదంపై స్పందించారు. సినిమాలో ఓ గీతంలో భజగోవిందం.. అనే పదం ఒకటి వచ్చింది. ఎడిటింగ్ లో దాన్ని మిస్ చేశారు. కావాలని పెట్టిందికాదు. రొమాంటిక్ గీతంలో ఇలా రావడం నా తప్పిదనమే. దీనిపై హిందువుల విశ్వాసాలను గాయపరిచారని కొందరు కేసు కూడా పెట్టారు. కానీ ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. కేసు పెట్టినవారికి ఆ పదం ఎలా వచ్చిందో, సన్నివేశం ఏమిటో వివరిస్తూ వారికి ఆ గీతాన్ని కూడా చూపించాను. అని దర్శకుడు యుగంధర్ క్లారిటీ ఇచ్చారు.
హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ హీరో హీరోయిన్లుగా నటించారు. కొత్తవారైనా కథ పరంగా బాగా నటించారు. కోవిడ్ ముందే సినిమా పూర్తయింది. థియేటర్లు లేకపోవడంతో ఇప్పటికి విడుదల చేస్తున్నాం. ప్రమోషన్‌లో భాగంగా యూత్‌ను ఆకట్టుకునేందుకే పోస్టర్లు, టీజర్‌ను విడుదల చేశాం. సినిమాలో అవి ప్రాధాన్యతలేనివి. అసలు కథ, తల్లిదండ్రులకు, యువతకు సంబంధించింది. దర్శకుడిగా నాకిది తొలి చిత్రం. ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యాక పెద్ద సంస్థ నాకు ఆఫర్ చేసింది అని తెలిపారు.