తన మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్న ఇలియానా తాజాగా ఓ కేక్ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇందుకు తగిన క్యాప్షన్ ఇచ్చింది: 'ప్రెగ్గీ పెర్క్స్' అంటూ చెప్పింది
ఇది అత్యుత్తమ బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని.. తన సోదరి తనకోసం తయారు చేసిందని తెలిపింది. ఏప్రిల్ 18న ఇలియానా తన మొదటి బిడ్డను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. తనకు కాబోయే బిడ్డ తండ్రి ఎవరనే విషయాన్ని మాత్రం ఇలియానా వెల్లడించలేదు.
కాగా లండన్‌లో నివసిస్తున్న మోడల్, కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌లో ఇలియానా మళ్లీ ప్రేమలో వున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.