త్రిష 'నాయకి' చూడాలనిపిస్తోందని.. ఇలియానా ట్వీట్
త్రిష తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ చిత్రంగా 'నాయకి' చేసింది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం త్రిష అభిమానులే కాదు.. తాను కూడా ఎదురుచూ
త్రిష తొలిసారిగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన హారర్ చిత్రంగా 'నాయకి' చేసింది. గోవి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం త్రిష అభిమానులే కాదు.. తాను కూడా ఎదురుచూస్తున్నానని ఇలియానా అంది. ఇటీవల 'నాయకి' సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌ను.. టీజర్‌ను చూశానని, చాలా ఆసక్తికరంగా అనిపించాయని చెప్పింది.
ఈ టీజర్‌లో త్రిష కొత్తగా.. చాలా గ్లామరస్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో త్రిష చాలా అద్భుతంగా నటించిందనే విషయం, ఈ టీజర్‌తో అర్థమైపోతోంది. త్రిష కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా 'నాయకి' మిగిలిపోవడం ఖాయమనిపిస్తోందన్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అనే ఆసక్తి తనలో కలుగుతోందని చెప్పింది. సాధారణంగా తాను హారర్ చిత్రాలు చూడననీ .. కానీ 'నాయకి' చూడాలనిపిస్తోందని చెప్పుకొచ్చింది.