Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐఫా అవార్డ్స్.. ఎన్టీఆర్‌కు అవార్డు.. పొంగిపోలేదు.. ఏం మాట్లాడాడో తెలుసా?

ఐఫా అవార్డు వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్‌కు చప్పట్లు అదిరిపోయాయి. టాలీవుడ్‌లో టాప్ హీరో అయినప్పటికీ హుందాగా.. గర్వం లేకుండా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్‌కు ఎంతో

Advertiesment
ఐఫా అవార్డ్స్.. ఎన్టీఆర్‌కు అవార్డు.. పొంగిపోలేదు.. ఏం మాట్లాడాడో తెలుసా?
, గురువారం, 30 మార్చి 2017 (15:27 IST)
ఐఫా అవార్డు వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్‌కు చప్పట్లు అదిరిపోయాయి. టాలీవుడ్‌లో టాప్ హీరో అయినప్పటికీ హుందాగా.. గర్వం లేకుండా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్‌కు ఎంతో ఉత్సాహపరిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఐఫా అవార్డుల వేడుకలో జనతా గ్యారేజ్ సినిమాకు ఉత్తమ నటుడి అవార్డును ఎన్టీఆర్ అందుకున్నాడు. 
 
గత ఏడాది ఈ అవార్డు ఎన్టీఆర్ (టెంపర్)కి రాకుండా మహేష్ బాబు (శ్రీమంతుడు)కు రావడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ ఏడాది ఈ అవార్డు జూనియర్ ఎన్టీఆర్‌ను వరించడంతో ఆయన ఏమాత్రం పొంగిపోకుండా.. హుందాగా మాట్లాడాడు. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకునే హీరో సాధారణంగా నిర్మాతను, దర్శకుడిని పొగడం చూసి వుంటాం. కానీ ఎన్టీఆర్ ఇందుకు తాను భిన్నమని నిరూపించాడు. 
 
కానీ, ఎన్టీఆర్ వేదికపై ఈ అవార్డుకు తనతో పాటు నామినేషన్‌ సాధించిన హీరోలందరి పేర్లూ చదివి వినిపించాడు. ఈ నామినేషన్‌ పొందిన హీరోలందరూ తమ సినిమాల్లో మెరుగైన ప్రదర్శనతో రాణించారని.. అలాగే తాను అందుకున్న ఈ అవార్డు తనకు ఒక్కడికే కాదని చెప్పాడు. ఈ అవార్డు నామినేట్ అయిన హీరోలందరూ చెందుతుందని తెలిపాడు. దీంతో చప్పట్లతో ఆహూతులందరూ అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురు, రోగ్, డోరతో పోటీపడుతున్న కాజల్ అగర్వాల్.. ఎంతవరకు ఈ ప్రేమ అంటూ..