Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఇది ప్రేమేనా..!’ ఆడియో ఆవిష్కరణ

యన్నమల్ల‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సుప్రీమ్‌, పావని జంటగా కిషన్‌ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’. ల‌యన్‌ సాయి వెంకట్‌ సమర్పకులుగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఆడియో శనివా

Advertiesment
idena prema audio launch
, ఆదివారం, 6 నవంబరు 2016 (15:41 IST)
యన్నమల్ల‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సుప్రీమ్‌, పావని జంటగా కిషన్‌ కన్నయ్య స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఇది ప్రేమేనా..!’. ల‌యన్‌ సాయి వెంకట్‌ సమర్పకులుగా వ్యవహరిస్తోన్న ఈ చిత్ర ఆడియో శనివారం హైదరాబాద్‌‌లో జరిగింది. అనీష్‌ దర్బారి సంగీతాన్ని సమకూర్చిన పాటల‌ తొలి సీడీని ల‌యన్‌ సాయి వెంకట్‌ విడుదల‌ చేసి దైవజ్ఞ శర్మకు అందించారు. 
 
అనంతరం ల‌యన్‌ సాయి వెంకట్‌ మాట్లాడుతూ... ‘‘దర్శక నిర్మాత కిషన్‌ కన్నయ్య మా జిల్లావాసి. చాలా మంది దర్శకుల‌ వద్ద దర్శకత్వశాఖలో పని చేశాడు. ఆ అనుభవంతో ‘ఇది ప్రేమేనా’ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా పట్ల తన అభిరుచి, కథ నచ్చి నేను ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం సెన్సార్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు. 
 
ప్రతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ ‘‘పాటలు, ప్రోమోస్‌ బావున్నాయి. మంచి పబ్లిసిటీతో విడుదల‌ చేస్తే ఫలితం కచ్చితంగా ఉంటుందన్నారు. ‘‘ఉత్సాహవంతులైన యువకులు కలిసి చేసిన ప్రయత్నం ‘ఇది ప్రేమేనా’. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ప్రోమోష్‌ కూడా అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి కనుక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదన్నారు దైవజ్ఞశర్మ. హీరో సుప్రీమ్‌ మాట్లాడుతూ...‘‘ ‘విచక్షణ’ అనే చిత్రంలో సెకండ్‌ హీరోగా నటించాను. సోలో హీరోగా చేస్తోన్న తొలి చిత్రమిది. దర్శక నిర్మాత కిషన్‌ నేను మంచి మిత్రులం. నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. 
 
అనీష్‌ దర్బారి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. చిత్ర దర్శక నిర్మాత కిషన్‌ కన్నయ్య మాట్లాడుతూ... ‘‘ల‌యన్‌ సాయి వెంకట్‌ గారి ప్రోత్సాహంతో ఈ సినిమా కార్యరూపం దాల్చింది. కథ అనుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సల‌హాలు-`సూచనల‌తో ఈ సినిమా రూపొందించాను. ఇదొక యూత్‌ఫుల్‌ వ్‌స్టోరీ. మూడు షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తి చేశాం. నాతో పాటు హీరో సుప్రీమ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో శ్ర‌మించారు. కథ మీద నమ్మకంతో నేనే నిర్మించాను’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జీవా - హన్సిక మోత్వాని కాంబినేషన్‌లో 'పోకిరిరాజా'