Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అల్లు అర్జున్ పుష్పకు మరో ప్రతిష్టాత్మక అవార్డు

allu arjun award
, గురువారం, 13 అక్టోబరు 2022 (18:11 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022' పురస్కారాన్ని గెలుచుకున్నాడు. వినోద రంగంలో అల్లు అర్జున్‌ ఈ అవార్డును కైవసం చేసుకున్నాడు.
 
'ఇండియన్‌ ఆఫ్ ది ఇయర్‌' ఘనత సాధించిన తొలి దక్షిణాది నటుడు అల్లు అర్జున్‌ కావడం గమనార్హం. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదగా బన్నీ ఈ అవార్డు తీసుకున్నాడు. 
 
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, 'మనమంతా భారత చలనచిత్ర రంగానికి బిడ్డలం. ఇది భారతదేశ సినిమా విజయం. కష్ట సమయాల్లో వినోదంతో దేశానికి సేవ చేయగలిగినందుకు గర్విస్తున్నాను. ఈ అవార్డును కొవిడ్‌ వారియర్స్‌కు అంకితమిస్తున్నా' అని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లవ్లీ , ప్రేమ కావాలి స్థాయిలోనే క్రేజీ ఫెలో వుంటుందిః ఆది సాయికుమార్‌