Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నగ్నంగా నేను అక్కడికి రాలేదు.. లో దుస్తులు వేసుకున్నాను.. అదీ స్కిన్ కలర్‌లో: బ్లాంకా బ్లాంకో

హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో ఆస్కార్ అవార్డుల వేడుకలో ధరించిన డ్రెస్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుక జరుగుతున్న వేళ బ

నగ్నంగా నేను అక్కడికి రాలేదు.. లో దుస్తులు వేసుకున్నాను.. అదీ స్కిన్ కలర్‌లో: బ్లాంకా బ్లాంకో
, శనివారం, 4 మార్చి 2017 (12:16 IST)
హాలీవుడ్‌ నటీమణి బ్లాంకా బ్లాంకో ఆస్కార్ అవార్డుల వేడుకలో ధరించిన డ్రెస్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారాలుగా గుర్తింపు పొందిన ఆస్కార్ వేడుక జరుగుతున్న వేళ బ్లాంకా బ్లాంకో చీప్‌ పబ్లిసిటీ కోసం ప్రయత్నించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పసుపురంగు గౌనులో హాజరైన ఆమె లోదుస్తులు వేసుకోకుండా... రహస్యాంగాలు ప్రదర్శించి విమర్శల పాలైంది.
 
బ్లాంకా బ్లాంకో చర్యను పలు అంతర్జాతీయ సినీ ప్రముఖులు తప్పుబట్టారు. ఇలాంటి గొప్పవేడుకలో ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటి అంటూ విమర్శించారు. ఓ విపరీతమైన మానసిక వ్యాధితో ఆమె బాధపడుతోందంటూ కొన్ని పత్రికలు ఏకిపారేశాయి. 
 
బ్లాంకా బ్లాంకో గౌన్‌ కట్‌ చాలా ఎక్కువగా ఉండడం, ఆమె లో దుస్తులు వేసుకోకపోవడం, అలాగే వివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులివ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గౌన్‌తో ఓ దశలో బ్లాంకో కూడా ఇబ్బంది పడింది. ఈ డ్రెస్‌పై సదరు హాలీవుడ్ నటి స్పందించింది. తాను ఆ రోజు నగ్నంగా లేనని, తన ప్రైవేట్‌ పార్ట్స్‌ బయటకు కనిపించాయనడం ఒట్టి పుకారేనని స్పష్టం చేసింది. 
 
ఆ రోజు అందరూ అనుకుంటున్నట్లు నగ్నంగా అక్కడికి రాలేదని స్పష్టం చేసింది. లో దుస్తులు వేసుకున్నానని.. కాకపోతే స్కిన్ కలర్‌లో ఉన్న బాడీ సూట్ వేసుకున్నానని స్పష్టం చేసింది. తనకు అకాడమీ అవార్డులంటే చాలా గౌరవం ఉందని.. అంత చీప్ పబ్లిసిటీ కోసం ప్రయత్నించే మనస్తత్వం తనకు లేదని చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపాల్ మాజీ భర్త విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?