Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కథ చెబితే నా పిల్లలు హాయిగా వింటారు, పాటపాడితే నిద్రపోతారు. వాయిస్ మహిమ అంటున్న శ్రీదేవి

మానవా, మానవా అంటూ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో కోట్లమందిని తన దేవకన్య పాత్ర ద్వారా మంత్రముగ్దులను చేసిన ప్రముఖ నటి హీరోయిన్ శ్రీదేవి నిజజీవితంలో తన వాయిస్‌ని తన కుమార్తెలిరువురికీ ఏమాత్రం నచ్చదని చెప్పారు. త్వరలో విడుదల కానున్న తన మామ్ చిత్రం ప్

Advertiesment
కథ చెబితే నా పిల్లలు హాయిగా వింటారు, పాటపాడితే నిద్రపోతారు. వాయిస్ మహిమ అంటున్న శ్రీదేవి
హైదరాబాద్ , శనివారం, 13 మే 2017 (07:40 IST)
మానవా, మానవా అంటూ జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో కోట్లమందిని తన దేవకన్య పాత్ర ద్వారా మంత్రముగ్దులను చేసిన ప్రముఖ నటి హీరోయిన్ శ్రీదేవి నిజజీవితంలో తన వాయిస్‌ని తన కుమార్తెలిరువురికీ ఏమాత్రం నచ్చదని చెప్పారు. త్వరలో విడుదల కానున్న తన మామ్ చిత్రం ప్రమోషన్‌‌లో భాగంగా జీ టీవీ సరేగమపలి పిల్లల పాటల రియాల్టీ షోలో పాల్గొన్న శ్రీదేవి తన కుమార్తెలు జాహ్నవి, కుషి తాను పాడితే అసలు ఇష్టపడరని పేర్కొన్నారు.
 
నిద్రపోవడానికి బెడ్ మీద పడుకున్నప్పుడు నేను కథ చదివి వినిపిస్తే వారు అస్సలు నిద్రపోరని, కానీ నేను కూనిరాగం తీస్తే వెంటనే వాళ్లు నిద్రపోతారని శ్రీదేవి చెప్పారు. ఎందుకంటే నా వాయిస్ బాగుండదు అందుకే వారు నా పాట వినడానికి ఇష్టపడరు అనేశారు. తన పిల్లలిద్దరూ చాలా సున్నితమైన మనస్సు కలిగిన వారని, వారితో కఠినంగా వ్యవహరించే అవకాశమే ఇవ్వరని శ్రీదేవి వివరించారు. తల్లికంటే వారితో స్నిహితురాలిగానే ఉంటానన్నారు. 
 
మా పిల్లలు జంక్ ఫుడ్ అసలు ఇష్టపడరు. దానికి భిన్నంగా నేను మాత్రం వారు ఏదో ఒకటి తింటే బాగుంటుందని అనుకుంటాను. తల్లిలేని స్త్రీ, తల్లి కాని స్త్రీ పరిపూర్ణురాలు కాదని నా అబిప్రాయం అన్నారు శ్రీదేవి. 
మదర్స్ డే సందర్భంగా ఆదివారం జీ టీవీలో శ్రీదేవి కార్యక్రమం ప్రసారం కానుంది. రవి ఉదయవార్ దర్శకత్వంలో తీసిన మామ్‌ సినిమాలో అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్ధిఖి నటించారు. జూలై 7న మామ్ విడుదల కానుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేకప్ అంత అసహ్యకరమైంది మరొకటి లేదంటున్న బాలీవుడ్ భామ