Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీలియోన్‌కు అంతుచిక్కని ఇన్‌ఫెక్షన్... శాకాహారిగా మారిపోయిందట!

ఐటెంగర్ల్‌గా, కథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న శృంగార తార సన్నీలియోన్. నటిగా వరుస అవకాశాలతో జోరుమీదున్న ఈ సుందరి త్వరలో నిర్మాతగా సరికొత్త అవతారమెత్తబోతుంది. సూపర్ హ

Advertiesment
సన్నీలియోన్‌కు అంతుచిక్కని ఇన్‌ఫెక్షన్... శాకాహారిగా మారిపోయిందట!
, మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:55 IST)
ఐటెంగర్ల్‌గా, కథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న శృంగార తార సన్నీలియోన్. నటిగా వరుస అవకాశాలతో జోరుమీదున్న ఈ సుందరి త్వరలో నిర్మాతగా సరికొత్త అవతారమెత్తబోతుంది. సూపర్ హీరో కథాంశంతో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే చిత్ర నిర్మాణ బాధ్యతల్ని చేపట్టడం సులభమేమీ కాదని, కానీ కథపై ఉన్న నమ్మకంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని చెబుతోంది. ఇదిలా ఉంటే... సన్నీలియోన్ ఉన్నట్టుండి శాఖాహారిగా మారిపోయిందట.
 
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఈ సుందరాంగి వైద్యుల సలహా మేరకు ఆల్కహాల్‌.. స్పైసీఫుడ్‌ని తప్పనిసరి పరిస్థితుల్లో వదిలివేయాల్సి వస్తుందని ట్విట్టర్‌ వేదికగా వాపోయింది. ''శరీరంలో అధిక వేడి వల్ల రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ వచ్చిందని.. ఇకనైనా జాగ్రత్త పడకపోతే ప్రమాదమని వైద్యులు చెప్పారు. అందుకే నేను నమ్మిన చైనా వైద్యం ద్వారా చికిత్స పొందుతున్నాను. 
 
దీంతో త్వరలోనే నేను కోలుకుంటానన్న నమ్మకం నాకుంది. అయితే వైద్యులు మాంసం, ఆల్కహాల్‌, కెఫీన్‌, స్పైసీఫుడ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ఈ అనారోగ్య సమస్యతో నేను శాకాహారిగా మారేందుకు ఆ దేవుడే దారి చూపాడని అనుకుంటున్నా'' అని సన్నీ ట్విటర్‌లో వెల్లడించింది. తన ''నాన్‌ వెజిటేరియన్'' నటనతో బాలీవుడ్ జనాలకు నిద్రలేకుండా చేస్తున్న సన్నీ.. వెజిటేరియన్‌గా మారిందంటే బాలీవుడ్ జనాలు షాకౌతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉక్రెయిన్‌‌లో బ్రిటిష్ భామతో రజనీకాంత్ రొమాన్స్...