Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళ హాస్యనటుడు సెంథిల్ చనిపోయారా? సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్

Advertiesment
తమిళ హాస్యనటుడు సెంథిల్ చనిపోయారా? సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్
, శనివారం, 7 మే 2016 (15:53 IST)
తమిళ సీనియర్ కామెడియన్ సెంథిల్ చనిపోయాడనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లుకొడుతున్నాయి. అయితే ఈ వార్త వినగానే సినీ అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తమిళ చలన చిత్ర పరిశ్రమకూడా తీవ్ర మనోవేదనకు గురైంది. తమిళంలో దాదాపు 500లకు పైగా చిత్రాల్లో సెంథిల్ నటించారు. 1980 - 90 దశకంలో మధ్య గొప్ప హాస్యనటుడు గౌండర్‌మణితో, కలిసి సెంథిల్ వైవిధ్యమైన హాస్యాన్ని పండిస్తూ తమిళ సినీపరిశ్రమలో రాణించాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో కొన్ని వందల సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. 
 
ఇద్దరూ కలిసి అద్భుతమైన కామెడీ పండించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా సెంథిల్ తెలుగువాళ్లకూ సుపరిచయమే. అయితే ఈ ప్రచారానికి స్పందించిన సెంథిల్ 'నేను చాలా బాగున్నా, నా అభిమానులు, మిత్రులు నా గురించి వచ్చిన వార్తలు నమ్మవద్దని ' చెప్పారు. ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే పార్టీకి మద్దతు పలికారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఇంతలో దుష్ప్రచారం జరగడంతో ఆయన ప్రకటన ఇచ్చాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంకటేష్ 75వ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం...