Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

20 మందిలో ఒక్కడు కూడా మిగల్లేదు... అందరూ నన్నలా చేస్తే వదిలేశా... ఎందుకంటే? షకీలా

షకీలా అనగానే ఆమె నటించిన పెద్దలకు మాత్రమే సినిమాలు గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ చిత్రాల్లో మాత్రమే నటించి మలయాళ సూపర్ స్టార్లకు సైతం పెద్ద పోటీగా నిచింది ఒకప్పుడు. ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలామ

Advertiesment
20 మందిలో ఒక్కడు కూడా మిగల్లేదు... అందరూ నన్నలా చేస్తే వదిలేశా... ఎందుకంటే? షకీలా
, మంగళవారం, 18 జులై 2017 (16:24 IST)
షకీలా అనగానే ఆమె నటించిన పెద్దలకు మాత్రమే సినిమాలు గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ చిత్రాల్లో మాత్రమే నటించి మలయాళ సూపర్ స్టార్లకు సైతం పెద్ద పోటీగా నిచింది ఒకప్పుడు. ఆమె చిత్రాలు విడుదలవుతున్నాయంటే చాలామంది వారివారి చిత్రాల విడుదళ్లను ఆపు చేసేసుకునేవారు. అలాంటి షకీలా తన ఆర్జించిన ధనాన్నంతా తన కుటుంబ సభ్యులకే పెట్టేసి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. తన హవా తగ్గిపోవడంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయింది. కానీ నటించేందుకు ఆట్టే అవకాశాలు రావడంలేదు. 
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను చెప్పుకువచ్చింది. తను ఇప్పటివరకూ ఎవర్నీ పెళ్లి చేసుకోలేదని తెలిపింది. ఐతే తన జీవితంలో 20 మంది ప్రేమికులు వున్నట్లు వెల్లడించింది. ఆ ప్రేమికుల్లో ఒక్కడు కూడా తనతో లేకుండా పోయాడని ఆవేదన చెందింది. మొదటివాడు... రెండవవాడు... మూడవ వాడు... ఇలా వరుసగా ప్రేమికులను వదిలేసినప్పటికీ తను ఎవరైనా ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు వచ్చి అడిగినా లేదంటే నాకు అతగాడు నచ్చినా వెంటనే లవ్‌లో పడిపోయేదాన్నని చెప్పింది. 
 
ఐతే ఒక్కో ప్రేమికుడు ఒక్కో రకంగా ప్రవర్తించేవాడనీ, ఒకడు తన తల్లిని వదిలేసి వచ్చేయమని నన్నడిగితే ఇంకొకడు సంపాదించిన డబ్బంతా తనకే ఇవ్వమనేవాడు. ఇంకొదరు తనను చిత్ర హింసలు పెట్టేవారనీ, వారిలో ఒకడు తనను విపరీతంగా కొట్టడంతో చిర్రెత్తిపోయి వాడిపై తిరగబడి ఇంట్లో తగిలించిన హ్యాంగర్ లాగి వాడిని చితకబాదానని గుర్తు చేసుకుంది. ఆ దెబ్బలు తట్టుకోలేక వాడు ఇంటి నుంచి పారిపోయాడని చెప్పింది. ప్రస్తుతం తను ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నట్లు వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఊర్వశి కుటుంబ కలహాలతోనే తాగుడుకు బానిసగా మారిందా? ఇలా చేసిందేమిటి?