Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాని గారు అంటే ఇష్టం, ఆయనతో వర్క్ చేయాలని వుంది : హీరోయిన్ మోక్ష

Advertiesment
Moksha

డీవీ

, సోమవారం, 29 జులై 2024 (20:05 IST)
Moksha
నేను బెంగాలీ అమ్మాయిని. కోల్‌కాతా నుంచి వచ్చాను. తెలుగులో  నా మొదటి సినిమా లక్కీ లక్ష్మణ్. అలనాటి రామచంద్రుడు నా రెండో సినిమా. గత రెండేళ్ళుగా తెలుగు మలయాళం తమిళ పరిశ్రమల్లో పని చేస్తున్నాను. తెలుగు అర్ధం అవుతుంది. మాట్లాడటం కూడా చాలా వరకూ వచ్చింది. అలనాటి రామచంద్రుడు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని హీరోయిన్ మోక్ష అన్నారు. 
 
కృష్ణ వంశీ, మోక్ష లీడ్ రోల్స్ పోషించగా, చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హైనివా క్రియేషన్స బ్యానర్ పై  హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 2న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ మోక్ష పలు విశేషాలని పంచుకున్నారు.
 
- ఇందులో నా క్యారెక్టర్ పేరు ధరణి. ఇదొక కమర్షియల్ పోయిటిక్ మూవీ. ట్రైలర్ చూస్తే బ్యూటీఫుల్ పోయిట్రీ వుంటుంది. నా క్యారెక్టర్ చాలా హైపర్, అల్లరిగా వుంటుంది, దర్శకుడు ఏం చెప్పారో అదే అద్భుతంగా ప్రజెంట్ చేశారు. చాలా బ్యూటీఫుల్ క్యారెక్టరైజేషన్, ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకునేలా వుంటుంది.ఈ సినిమాలో నాకు చాలా మంచి డైలాగులు వున్నాయి.    
 
-దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఈ పాత్ర నా కోసమే పుట్టిందేమో అనిపించింది. నా ఆడిషన్ ఆయనకి నచ్చింది. దిని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. డైరెక్టర్ గారు చాలా మంచి విజన్ తో అద్భుతంగా ఈ సినిమా చేశారు. చాలా హానెస్ట్ గా కష్టపడి తీసిన సినిమా ఇది.
 
-మనాలి, అమలాపురం, వైజాగ్ ఇలా డిఫరెంట్ లోకేషన్స్ లో సినిమాని షూట్ చేశాం, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా కథకు కావాల్సిన ప్రతిది సమకూర్చారు. ఒక పెద్ద సినిమాలానే చేశారు. వారికి హ్యాట్సప్ చెప్పాలి. చాలా విజనరీ ప్రొడ్యూసర్స్.  
 
-చాలా తెలుగు సినిమాలు చూశాను. సావిత్రి గారు చేసిన దేవదాస్ నుంచి అనుష్క గారి అరుంధతి, లేటెస్ట్ సాయి పల్లవి గారి విరాట పర్వం వరకూ ఎన్నో సినిమాలని ఎంజాయ్ చేశాను. సీతారామం, హనుమాన్ ఎంతగానో నచ్చాయి. అందరూ ఇష్టమే. నాని గారు అంటే ఇష్టం, ఆయన శ్యామ్ సింగారాయ్ లో బెంగాల్ నేపధ్యం వుంటుంది. ఆయనతో వర్క్ చేయాలని వుంది.      
 
-తెలుగు సినిమాలు చేయడం చాలా ఆనందంగా వుంది. తెలుగు పాన్ ఇండియా ఇండస్ట్రీ. ఇక్కడ ఆడియన్స్ చాలా లవబుల్ గా వుంటారు. ప్రమోషన్స్ లో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.  
 
నెస్ట్ ప్రాజెక్ట్స్ గా రామం రాఘవం సినిమా చేస్తున్నాను. అలాగే ఒక మలయాళం సినిమా విడుదలకు రెడీ అవుతుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరదా మూవీ నుంచి రత్నమ్మ గా సంగీత ఫస్ట్ లుక్