Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒక మనసు తీవ్ర నిరాశకు లోనైనా... వెనక్కి తగ్గేది లేదంటున్న నీహారిక

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక. ఈమె నాగ చైతన్యతో ఒక మనసు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తీవ్ర నిరాశకు లోను చేసింది. ఈ దెబ్బతో ఆమె సినిమా ఆలోచనలు మానుకుని, తిరిగి బుల్లితెర మీదకు

ఒక మనసు తీవ్ర నిరాశకు లోనైనా... వెనక్కి తగ్గేది లేదంటున్న నీహారిక
, గురువారం, 11 ఆగస్టు 2016 (15:13 IST)
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ నీహారిక. ఈమె నాగ చైతన్యతో ఒక మనసు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తీవ్ర నిరాశకు లోను చేసింది. ఈ దెబ్బతో ఆమె సినిమా ఆలోచనలు మానుకుని, తిరిగి బుల్లితెర మీదకు వెళ్లిపోతుందని ఫిల్మ్ నగర్‌లో జోరుగా గుసగుసలు వినిపించాయి. 
 
వీటిపై ఆమె స్పందిస్తూ ఒక మనసు నిరాశపరిచినంత మాత్రాన వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటున్నారు. క్రీడల్లో గెలుపోటములు ఎంత సహజమో.. సినిమాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
 
కాగా, ప్రస్తుతం ఆమె రెండు సినిమాలకు సంతకాలు పెట్టినట్టు తెలుస్తోంది. వాటిలో ఒక సినిమాను నూతన దర్శకుడు కార్తీక్‌ డైరక్షన్‌లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో నిహారికకు జోడీగా 'పెళ్లి చూపులు' హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్నాడు. ఇది పూర్తి వినోదాత్మకంగా సాగే ప్రేమకథ అని తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనతా గ్యారేజ్ న్యూ పోస్టర్‌లో ఫోటో షాప్ తప్పులు... పట్టించుకోని చిత్ర బృందం!