Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనతా గ్యారేజ్ న్యూ పోస్టర్‌లో ఫోటో షాప్ తప్పులు... పట్టించుకోని చిత్ర బృందం!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ''టెంప‌ర్''‌, ''నాన్న‌కు ప్రేమ‌తో'' సినిమాల‌తో హిట్లు సాధించి మాంచి ఊపుతో ''జనతా గ్యారేజ్''తో బాక్సాఫీసు హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేక లుక్‌లో క‌న

జనతా గ్యారేజ్ న్యూ పోస్టర్‌లో ఫోటో షాప్ తప్పులు... పట్టించుకోని చిత్ర బృందం!
, గురువారం, 11 ఆగస్టు 2016 (15:09 IST)
యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ''టెంప‌ర్''‌, ''నాన్న‌కు ప్రేమ‌తో'' సినిమాల‌తో హిట్లు సాధించి మాంచి ఊపుతో ''జనతా గ్యారేజ్''తో బాక్సాఫీసు హిట్  కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ సినిమా కోసం ప్ర‌త్యేక లుక్‌లో క‌నిపిస్తూ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ఈ మూవీలో ఎన్టీ ఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రను పోషించాడు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వెలువడుతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ ఈ చిత్రాన్ని అంచనాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్ .. టీజర్‌కు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 12న జనతా గ్యారేజ్ ఆడియో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ పోస్టర్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్ పట్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు పాటించిన చిత్ర బృందం ఫోటో షాప్ విషయంలో కనీస జాగ్రత్తలను పాటించిపోవడం గమనార్హం. 
 
ఎన్టీఆర్ కుడి చెయ్యి.. అలాగే సమంత కుడి చెయ్యి.. ఆ వేళ్ళలో ఏదో తేడా ఉన్నట్లు అనిపించట్లేదు. ఫోటో షాప్ సాఫ్టువేర్‌లో వెనుకాల బ్యాగ్రౌండ్ కట్ చేసి రంగు మారుస్తున్న సమయంలో.. వేళ్ళు సరిగ్గా కట్ చేయలేదు. ఆ తేడా ఈ పోస్ట‌ర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఫోటోను చూస్తే పోస్టర్‌లో ఉన్న తప్పేంటో ఇట్టే అర్థమౌతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమలాపాల్‌కు సముద్రకని సపోర్ట్: పెళ్లికి తర్వాత నటించడం ఆమె ఇష్టం.. సూర్యను చూసి నేర్చుకోండి..!