డొనాల్డ్ ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు.. ఆ ప్రోగ్రామ్‌కు రానంతే: ఇలియానా
గోవా బ్యూటీ ఇలియానా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నరిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బోల్డ్‌గా మనసు తోచిన విషయాన్ని సూటిగా చెప్పేసే ఇలియానా.. డొనాల్ట్ ట్రంప్‌కు త
గోవా బ్యూటీ ఇలియానా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్నరిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించింది. బోల్డ్‌గా మనసు తోచిన విషయాన్ని సూటిగా చెప్పేసే ఇలియానా.. డొనాల్ట్ ట్రంప్‌కు తాను సపోర్ట్ చేయనని స్పష్టం చేసింది. అక్టోబర్ 15న న్యూజెర్సీలోని పీఎన్సీ ఆర్ట్ సెంటర్‌లో 'హ్యూమానిటీ యునైటెడ్ అగైనెస్ట్ టెర్రర్' అనే చారిటీ కార్యక్రమం జరగబోతోంది.
ఉగ్ర బాధితులకు విరాళాలు సేకరించడానికి రిపబ్లికన్ హిందూ కోలిషన్(ఆర్‌హెచ్‌సీ) నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమానికి ఇలియానాని కూడా ఆహ్వానించారు. కానీ ఇలియానా ఇందుకు ఒప్పుకోలేదు. అంతేకాకుండా డొనాల్డ్ ట్రంప్‌కి సపోర్ట్ చేయనని వెల్లడించింది.
బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులకు అమెరికాలోనూ వేలాది మంది అభిమానులున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రంప్‌కి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందని భావించి ఆర్‌హెచ్‌సీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇలియానా మాత్రం ట్రంప్‌కు సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.