ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పేరును ఉపయోగించుకుని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. చైతన్య పేరిట తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ.. కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
ఇంతటి మోసానికి పాల్పడుతున్న చైతన్య అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని సునీత స్పష్టం చేశారు. సెలబ్రేటీల పేరు చెప్పగానే ఎలా డబ్బులు ఇస్తారని.. ప్రతి రోజు మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నా.. ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అయినా కూడా ఎందుకు అలాంటివారిని నమ్ముతారు అంటూ సునీత అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు తను చైతన్య అనే వక్తిని కలవను కూడా కలవలేదని స్పష్టం చేశారు. చైతన్య తన పేరు ఉపయోగించుకుని అమాయకులను మోసం చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. తనకు చైతన్య అనే అల్లుడు ఎవరూ లేరంటూ ఫేస్ బుక్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.