Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినిమా ఛాన్స్ కావాలంటే.. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయాలన్నాడు: రెజీనా

సమాజంలో మహిళలపై వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదు. నిన్నటి నిన్న ఒంటరి, మహాత్మా హీరోయిన్ భావన లైంగిక వేధింపుల నుంచి తృటిలో తప్పించుకుని బయటపడింది. ఈ ఘటనపై సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ల

Advertiesment
సినిమా ఛాన్స్ కావాలంటే.. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయాలన్నాడు: రెజీనా
, సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (13:18 IST)
సమాజంలో మహిళలపై వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదు. నిన్నటి నిన్న ఒంటరి, మహాత్మా హీరోయిన్ భావన లైంగిక వేధింపుల నుంచి తృటిలో తప్పించుకుని బయటపడింది. ఈ ఘటనపై సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. లైంగిక వేధింపులు నటీమణులపై సాధారణమైపోయిందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. అందాల భామ రెజీనా కసాండ్రా.. తనకు ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుంది. 
 
దాదాపు ఏడేళ్ల క్రితం తాను ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నాను. ఆ సమయాన ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి తమిళ సినిమాకు అవకాశం ఇస్తానని చెప్పాడు. ఆ మాట వినగానే సంతోషంగా ఉన్నది. కానీ ఛాన్స్ కావాలంటే మాత్రం కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేయాలని అడిగాడని రెజీనా తెలిపింది. ఆ సమయంలో అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఫోన్ పెట్టేశానని అంది. ఇటువంటి పరిస్థితి చాలామందికి ఎదురవుతూనే ఉంటుందని.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వేళ మహిళలకు తమను తాము ఎలా కాపాడుకోవాలో తెలిసుండాలని సలహా ఇచ్చింది.
 
కాగా మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసుపై సామాజిక మాధ్యమాలు, మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సమయంలో సెలెబ్రిటీలు  తమ చేదు అనుభవాలు గుర్తు చేసుకుంటున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ మొదటిగా ఈ విషయమై నోరు విప్పింది. ఆపై నగ్మా, మంచు లక్ష్మి, స్నేహ గళం విప్పారు. ఇప్పుడు రెజీనా కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పైవిధంగా చెప్పుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షారూక్ ఖాన్‌కు యశ్ చోప్రా స్మారక అవార్డు... ప్రదానం చేసిన టీఎస్సార్