వాట్ ఏ ఐడియా సన్నీ.. కండోమ్ యాడ్‌లో ఎందుకు నటిస్తుందో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ శృంగారోపదేశాలు వల్లిస్తుంది. శృంగారంలో తన అనుభవాన్ని జోడించి తన అభిమానులకు శృంగారంలో ఉచిత సలహాలను బోధిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అవాం
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ శృంగారోపదేశాలు వల్లిస్తుంది. శృంగారంలో తన అనుభవాన్ని జోడించి తన అభిమానులకు శృంగారంలో ఉచిత సలహాలను బోధిస్తుంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... అవాంఛిత గర్భం, లైంగిక వ్యాధుల బారిన పడకుండా కండోమ్ వాడమని సూచిస్తుంది. కండోమ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సన్నీ మాట్లాడుతూ... కండోమ్‌తో శృంగారంలో పాల్గొనడం వల్ల అవాంఛిత గర్భం రాకుండా నిరోధించడం మాత్రమేకాక ఇతర సుఖవ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునని అంటుంది.
ఈ కారణంతోనే తాను కండోమ్ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా ఉన్నట్టు పేర్కొంది. అయితే అగ్ర కథానాయికలు ఎందుకు కండోమ్ ప్రకటనలు చేయడం లేదని విలేఖరి అడిగిన ప్రశ్నకు... 'ఇలాంటి అంశాల్లో ఎవరి ఇష్టం వారిది. ఎవరి అభిప్రాయం వారిదని టాలెంట్‌గా సన్నీ కప్పిపుచ్చింది. సురక్షిత శృంగారం గురించి, కండోం గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇప్పటికి ప్రాణాంతక వ్యాధి బారిన చాలా మంది చిక్కుకుంటున్నారు.
ప్రాణాంతక వ్యాధి ఒక్కటే కాకుండా.. ఇతర సుఖవ్యాధులు కూడా సోకుతున్నాయని.. అందుకే కండోమ్ వాడండి, సురక్షిత శృంగారంలో పాల్గొనండి అంటూ ప్రచారం చేస్తుంది... ఎంతైనా అనుభవజ్ఞురాలు కదా ఈ పోర్న్ సుందరి సన్నీలియోన్!