Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను వై.ఎస్‌.ఆర్‌. అభిమానిని అందుకే మ‌హేష్‌తో డైలాగ్‌లు చెప్పించా - ప‌ర‌శురామ్‌

Parashuram
, శుక్రవారం, 6 మే 2022 (17:21 IST)
Parashuram
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా  ఈనెల 12న విడుద‌ల కాబోతుంది. ఈ సినిమాలో వై.ఎస్‌.ఆర్‌. డైలాగ్‌లు పెట్టారు. దీనిపై ద‌ర్శ‌కుడు స్పందించారు.
 
సర్కారు వారి పాటని పోకిరితో పోల్చుతున్నారు ?
పోకిరి ఒక అండర్ కాప్ బిహేవియర్. సర్కారు వారి పాట ఒక కామన్ మాన్ బిహేవియర్. ఇందులో ఇంకాస్త ఓపెన్ అవుతారు. మ్యానరిజమ్స్, లుక్స్ , బాడీ లాంగ్వెజ్.. చూసి ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతారు.
 
'నేను విన్నాను.. నేను వున్నాను' డైలాగ్ పెట్టారు.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి ప్రేరణా ?
నాకు రాజశేఖర్ రెడ్డి గారంటే అభిమానం. ఆయన్ని చూస్తే ఒక హీరో ఫీలింగ్. చాల గొప్ప మాటని సింపుల్ గా చెప్పేశారు. సర్కారు వారి పాట లో కూడా అలాంటి ఒక సందర్భం వచ్చింది. మహేష్ గారు ఆ డైలాగు చెప్పారు. నేను కథ చెప్పినపుడే ఈ డైలాగ్ గురించి చెప్పాను. మహేష్ గారు చాలా ఎంజాయ్ చేశారు. ఆ సీన్ వరకు వచ్చి వెళ్ళిపోయే డైలాగ్ అది. ఆ సీన్ అద్భుతంగా వుంటుంది.
డైలాగులు బాగా రాస్తారు కదా .. దీనికి ప్రేరణ ?
మా గురువు గారు పూరి జగన్నాధ్ గారు, త్రివిక్రమ్ గారి సినిమాలన్నీ చూస్తాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క‌లర్స్ స్వాతి రెడ్డి ఇడియట్స్ ఫస్ట్ లుక్ విడుదల