9 నెలలు ఎప్పుడు నిండుతాయా అని ఎదురుచూస్తున్నా... యాంకర్ శ్యామల
బుల్లితెరపై తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల ఇప్పుడు ఐదవనెల గర్భిణి. ఈ సంగతిని ఆమె వెల్లడించారు. ఐతే తనకు ఎప్పుడెప్పుడు 9 నెలలు నిండుతాయా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు... ఈ సమయంలో యాంకరింగ్ కు కొంత గ్యాప్ కూ
బుల్లితెరపై తనకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శ్యామల ఇప్పుడు ఐదవనెల గర్భిణి. ఈ సంగతిని ఆమె వెల్లడించారు. ఐతే తనకు ఎప్పుడెప్పుడు 9 నెలలు నిండుతాయా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు... ఈ సమయంలో యాంకరింగ్ కు కొంత గ్యాప్ కూడా తీసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది.
యాంకర్ శ్యామల బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ఆరేళ్లక్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. బుల్లితెరపై నరసింహారెడ్డి ఎంత ఫ్యామస్ అయ్యారో తెలియదు కానీ శ్యామల మాత్రం సూపర్ పాపులారిటీ సాధించింది. ఫంక్షన్లు, గేమ్ షోలలో ఆమె యాంకరింగ్ ఆకట్టుకుంటుంది.